Begin typing your search above and press return to search.
టీమ్ అందరూ ఫ్లాపుల్లోనే..ఇస్మార్ట్ హిట్ దక్కేనా?
By: Tupaki Desk | 30 Jun 2019 11:21 AM GMTజులైలో రిలీజ్ కానున్న సినిమాల్లో 'ఇస్మార్ట్ శంకర్' ఒకటి. ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. టీజర్ మాత్రమే కాకుండా ఇప్పటివరకూ రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్ కూడా మంచి స్పందన దక్కించుకోవడం 'ఇస్మార్ట్ శంకర్' టీమ్ లో ఫుల్ జోష్ ను నింపింది. అయితే ఈ సినిమాతో అసోసియేట్ అయిన అందరి కేరీర్లకు 'ఇస్మార్ట్ శంకర్' విజయ కీలకం కానుంది.
మొదటగా ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాధ్ గురించి చెప్పుకుంటే.. ఆయన హిట్ అన్నమాట విని కొన్నేళ్లయింది. పూరి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా తమ ఫేవరెట్ డైరెక్టర్ బౌన్స్ బ్యాక్ అవుతాడన్న నమ్మకాన్ని దాదాపుగా వదిలేసిన టైమ్ లో ఈ సినిమా విజయంపై మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి. నిర్మాతలుగా కూడా పూరి.. ఛార్మీలకు ఈ సినిమా ఒక టెస్ట్. ఎందుకంటే ఈమధ్య వీరు నిర్మించిన సినిమాలేవీ కాసుల వర్షం కురిపించ లేదు.
ఇక హీరో రామ్ పోతినేని పరిస్థితి కూడా సేమ్. ఈ సినిమాకు ముందు నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచాయి. ఆమధ్య 'నేను శైలజ' సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడనుకునేలోపే వరసగా సినిమాలు నిరాశపరచడంతో రామ్ ఆశలన్నీ ఈ సినిమా విజయంపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్ల పరిస్థితి అందుకు భిన్నమేమీ కాదు. నిధి అగర్వాల్ ఇప్పటి వరకూ రెండు సినిమాల్లో నటిస్తే రెండూ ఫెయిల్యూర్లే. ఈ సినిమా విజయం తన కెరీర్ కు కీలకం కానుంది. ఇక మరో హీరోయిన్ నభ నటేష్ కూడా రెండు తెలుగు సినిమాల్లో నటించింది. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'అదుగో'.. సుధీర్ బాబు చిత్రం 'నన్ను దోచుకుందువటే'. రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. అయితే 'నన్ను దోచుకొందువటే' మాత్రం నభ నటనకు మంచి పేరు తీసుకొచ్చింది.
ఇంతటితో ఈ లిస్టు ఆగలేదు. మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆయన సంగీతం అందించిన గత అర డజను సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డవే. ఈ లెక్కన 'ఇస్మార్ట్ శంకర్' లో అందరికీ సక్సెస్ అవసరం. మ్యాథ్స్ లో మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టూ ప్లస్ అని చిన్నప్పుడు చదువుకొని ఉంటారు కదా.. అలా ఇన్ని మైనస్ లు కలిసి ఇస్మార్ట్ గా ప్లస్ అవుతాయేమో వేచి చూడాలి. ఈ విషయం తేలేది జులై 18 వ తేదీనే.