Begin typing your search above and press return to search.
ఇస్మార్ట్ బ్యూటీస్ కి ఒకరంటే ఒకరికి పడటం లేదా...?
By: Tupaki Desk | 23 Aug 2020 9:30 AM GMTడేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. పూరీ సినిమాల్లో హీరోయిన్స్ అంటే ఓ వైపు గ్లామర్ షో చేస్తూనే మరో వైపు యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రల్లో కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ - నభా నటేష్ ఇద్దరూ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇస్మార్ట్ బ్యూటీస్ గా మారిపోయారు. ఈ మూవీతో వచ్చిన క్రేజ్ తో ప్రస్తుతం ఇద్దరూ టాలీవుడ్ లో రైజింగ్ లో ఉన్నారు. ఇద్దరికీ కూడా ఒకే సినిమాతో స్టార్ స్టేటస్ రావడంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ ని లక్కీగా భావించిన దర్శక నిర్మాతలు వీరిద్దర్ని ఒకే సినిమాలోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించడానికి ఒప్పుకుంటున్నప్పటికీ ఒకరంటే ఒకరికి పడటం లేదని క్యాస్టింగ్ వర్గాలు చెప్తున్నాయి.
కాగా నభా నటేశ్ ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'.. బెల్లకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' చిత్రాల్లో నటిస్తోంది. మరో వైపు నిధి అగర్వాల్ 'భూమి' అనే తమిళ్ సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలోనూ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో లక్కీ హీరోయిన్స్ ఇద్దరూ ఉంటే బాగుంటుందని మేకర్స్ నభా నటేశ్ ని కూడా తీసుకున్నారట. అయితే 'ఇస్మార్ట్ శంకర్' లో నభా నటేశ్ రోల్ ఎక్కువ సేపు లేకపోయినా నిధి కంటే కాస్త ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో నిధి ఇప్పుడు గల్లా అశోక్ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోందట. నభా రోల్ కంటే తన రోల్ కి ఎక్కువగా మాస్ అంశాలు ఉండేలా చూడమని మేకర్స్ ని రిక్వెస్ట్ చేస్తోందట. మరోవైపు నభా నటేశ్ కూడా అంతే రేంజ్ తో తన క్యారెక్టర్ కోసం కూపీలు లాగుతోందని సమాచారం. ఇక ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు.