Begin typing your search above and press return to search.
నిధి అగర్వాల్ మకాం మార్చేసిందా ఏమిటి?!
By: Tupaki Desk | 18 Dec 2020 2:30 AMకొంతకాలం క్రితం తెలుగు తెరకి పరిచయమైన నాజూకు భామల లిస్టులో 'నిధి అగర్వాల్' కూడా కనిపిస్తుంది. చక్కని కనుముక్కుతీరుతో ఈ సుందరి యూత్ హృదయాలను కాజేసింది. హిందీ సినిమాతో కెరియర్ ను మొదలెట్టిన ఈ అమ్మాయి, తెలుగు తెరపై వాలడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు. ముందుగా నాగచైతన్య సినిమా 'సవ్యసాచి'లో అవకాశాన్ని పట్టేసిన ఈ బ్యూటీ, ఆ తరువాత అఖిల్ జోడీగా 'మిస్టర్ మజ్ను'లో ఆడిపాడింది. అయితే అక్కినేని ఫ్యామిలీ హీరోలతో చేసిన రెండు సినిమాలు ఈ కందిరీగకు కలిసిరాలేదు.
సన్నజాజి తొడిమలాంటి ఈ అమ్మాయి, తన గ్లామర్ కి సక్సెస్ కలిసిరాకపోవడంతో డీలాపడిపోయింది. అలాంటి పరిస్థితుల్లోనే పూరి జగన్నాథ్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేసింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ ని పూరి .. 'అందాల నిధి'గానే చూపించాడు. అమ్మడి గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడంతో, ఈ రాజకుమారి బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటి సంఘటనలేవీ జరగలేదు. కొత్త హీరోతో ఒక సినిమా కమిట్ అయినట్టుగా వార్తలు వచ్చాయి .. ఆ తరువాత దాని గురించిన ఊసులేదు.
కొత్తగా చాలా సినిమాలు పూజలు చేయించుకుని .. క్లాప్ లు కొట్టుకుంటున్నాయి. అయినా ఏ హీరో సరసన నిధి అగర్వాల్ పేరు వినిపించడం లేదు. ప్రస్తుతం నిధి అగర్వాల్ తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. 'భూమి' .. 'ఈశ్వరన్' పేర్లతో ఈ సినిమాలు రూపొందుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాలు థియేటర్స్ కు రానున్నాయి. సాధారణంగా ఒక భాషలో అవకాశాలు లేనివారు మరో భాషా చిత్రాలపై దృష్టిపెడుతుంటారు. అలాంటిది తెలుగులో ఒక సూపర్ హిట్ దక్కిన తరువాత నిధి అగర్వాల్ కోలీవుడ్ పై శ్రద్ధ పెట్టడం ఆశ్చర్యం. కోలీవుడ్ పై కొత్త మోజుతో నిధి అగర్వాల్ అక్కడికి మకాం మార్చేసిందా? అక్కడి సినిమాలు పూర్తికాగానే ఇటో అడుగు వేస్తుందా? అనేది చూడాలి.