Begin typing your search above and press return to search.

జాక్ పాట్ కొడుతున్న మజ్ను బ్యూటీ

By:  Tupaki Desk   |   10 Dec 2018 8:48 AM GMT
జాక్ పాట్ కొడుతున్న మజ్ను బ్యూటీ
X
అక్కినేని నాగ చైతన్య సవ్యసాచి ద్వారా టాలీవుడ్ డెబ్యూ చేసిన నిధి అగర్వాల్ కు మొదటి సినిమా ఫలితం కలిసి రాకపోయినా ఇక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నయ్య సినిమా రిజల్ట్ తేలకముందే తమ్ముడు అఖిల్ మిస్టర్ మజ్నులో ఛాన్స్ కొట్టేసిన నిధి అది రిలీజ్ కానున్న జనవరి కోసం ఎదురు చూస్తోంది. అది కనక హిట్ అయితే పెద్ద బ్రేక్ దొరుకుతుందన్న నమ్మకంతో ఉంది.

ఇదిలా ఉండగా నిధికి అదృష్టలక్ష్మి మరోసారి తలుపు తడుతోంది. వరుస సినిమాల నిర్మాణంతో దూకుడు మీదున్న మైత్రి సంస్థ నిధి అగర్వాల్ కు ఏకంగా రెండు ఆఫర్లు ఇచ్చిందట. ఈ బంపర్ డీల్ కి నిధి కూడా ఆలోచించకుండా ఓకే చెప్పినట్టుగా సమాచారం. అయితే వాటిలో హీరోలు ఎవరు దర్శకుల సంగతేంటి లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అందులో ఒకటి డెబ్యూ డైరెక్టర్ తో ఉండవచ్చని టాక్.

మైత్రి ప్రస్తుతం రెండు సినిమాల నిర్మాణంలో ఉంది. డియర్ కామ్రేడ్ తో పాటు చిత్రలహరి నిర్మాణంలో ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో రష్మిక మందన్న హీరోయిన్ కాగా రెండో దాంట్లో నివేత పేతురాజ్ కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లు. సో మైత్రి ఇచ్చిన కాంబో ఆఫర్లో ఈ రెండు మాత్రం ఖచ్చితంగా లేవు. త్వరలో మైత్రి ప్రకటించబోయే కొత్త సినిమాల లిస్ట్ లో నిధివి ఉండే అవకాశం ఉంది. మొత్తానికి సాలిడ్ గా హిట్ కొట్టకుండానే ఇలా ఛాన్సులు కొట్టేస్తున్న నిధికి లక్ కూడా బాగా కలిసి వస్తున్నట్టుంది