Begin typing your search above and press return to search.

సొగసుల 'నిధి'కి లౌక్యం వంటబట్టినట్టుందే!

By:  Tupaki Desk   |   29 Dec 2021 11:30 PM GMT
సొగసుల నిధికి లౌక్యం వంటబట్టినట్టుందే!
X
టాలీవుడ్ తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన కలువల్లాంటి కథానాయికలలో నిధి అగర్వాల్ ఒకరు. అదేమిటో గానీ ఈ బ్యూటీ ఏ డ్రెస్ వేసినా, ఆమె అధరాలకి దిగువున ఉన్న అందాలను మాత్రం కప్పలేకపోతున్నాయి. ఇక ఈ సుందరికి యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దానిమ్మ మొగ్గలా తెరపై కనిపిస్తూ ఊరించే ఈ పిల్లకి తమ కళ్లను అప్పగించి కుర్రాళ్లంతా అలా ఉండిపోతున్నారు. ఆమె అందాలకు తమ ఊహలను అంకితం చేయాలని ఉబలాట పడుతున్నారు. ఆ మాత్రం క్రేజ్ చాలు రెచ్చిపోవడానికి అన్నట్టుగా ఈ అమ్మడు తన దూకుడు చూపుతోంది.

అందంగా ఉన్నవారే కథానాయికలు అవుతారు. కొంతమంది ఏళ్లతరబడి వెండితెరను ఏలేస్తే, మరికొంతమంది పట్టుమని పది సినిమాలు కూడా చేయలేకపోతున్నారు. అందుకు కారణం ఏమిటా అని నిధి అగర్వాల్ బాగానే ఆలోచించి ఉంటుంది. గుమ్మడి పువ్వులాంటి అందం ఉండగానే సరిపోదు .. గురిగింజంత అదృష్టం కూడా ఉండాలి. అలాగే ఆవగింజంత లౌక్యం కూడా కావాలనే విషయం ఆమెకి అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఆమె మాటలు వింటే అలాగే అనిపిస్తోంది మరి. తాజాగా సోషల్ మీడియాలో నిర్వహించిన చాట్ సెషన్ లో అభిమానుల ప్రశ్నలకి ఆమె బదులిచ్చింది.

'మీకు ఇష్టమైన సాంగ్ ఏది?' అంటూ ఒక అభిమాని అడగ్గా, 'భీమ్లా నాయక్'లోని 'లాలా భీమ్లా' సాంగ్ తన ఫేవరేట్ సాంగ్ అని చెప్పుకొచ్చింది. తమన్ స్వరపరిచిన ఈ మాస్ సాంగ్ అంతా కూడా పవన్ పవర్ఫుల్ హీరోయిజానికి అద్దం పడుతూ ఉంటుంది. పవన్ ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి .. ఆయన లక్షణాలను పరిశీలించిన వ్యక్తి .. ఆయనకి అత్యంత సన్నిహితుడు అనిపించుకున్న త్రివిక్రమ్ రాసిన పాట ఇది. అరుణ్ కౌండిన్య ఒక రకమైన ఆవేశంతో పాడిన పాట ఇది. పాటలో పూనకాలు వచ్చినట్టుగా లేడీస్ స్టెప్పులు వేస్తుంటారు.

నిజానికి ఇలాంటి పాటలు తమిళ సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాము. అదే తరహాలో ఈ పాటను డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనా ఇలాంటి ఒక మాస్ సాంగ్ తన ఫేవరేట్ సాంగ్ అని నిధి అగర్వాల్ చెప్పడం విశేషమే. ప్రస్తుతం ఆమె పవన్ సరసన నాయికగా 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ఆమె 'పంచమి' అనే పాత్రలో కనిపించనుంది. తన ఫేవరేట్ హీరో పవన్ కల్యాణ్ అంటూ రీసెంట్ గా చెప్పిన ఆమె, ఫేవరేట్ సాంగ్ కూడా ఆయనదే చెప్పడం చూస్తుంటే, కాస్త లౌక్యం వంటబట్టించుకున్నట్టుగా అనిపించడం లేదూ!