Begin typing your search above and press return to search.
రాహుల్ తో ఎఫైర్ పై నోరువిప్పిన నటి
By: Tupaki Desk | 12 July 2018 10:59 AM ISTప్రముఖ భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ తో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ కు ఎఫైర్ ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కొద్దికాలంగా ఈ వార్తలు వైరల్ అయినా ఇంతవరకూ దీనిపై వారిద్దరూ స్పందించలేదు. కానీ ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ ఎట్టకేలకు కేఎల్ రాహుల్ తో ఉన్న బంధంపై క్లారిటీ ఇచ్చింది.
‘తానది, కేఎల్ రాహుల్ లది ఒకటే నగరం. చాలాకాలంగా మేమిద్దరం స్నేహితులం. నేను నటిగా.. ఆయన క్రికెటర్ గా మారినప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. మా మధ్య ఏదో ఎఫైర్ ఉందనే గాలివార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలు మా మధ్య దూరాన్ని పెంచలేదు. మా ఫ్రెండ్ షిప్ కు అడ్డం కాలేదు.. మీడియాలో వస్తున్నట్టు మా మధ్య ఎఫైర్ లేదు. మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే’ అని నిధి అగర్వాల్ నిజాన్ని బయటపెట్టింది.
మున్నా మైఖేల్ చిత్రంతో బాలీవుడ్ లోకి నిధి అగర్వాల్ అడుగుపెట్టింది. ఇక సవ్యసాచి చిత్రంతో తెలుగులోకి ప్రవేశించింది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు మాధవన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నది. అలాగే అక్కినేని అఖిల్ తో ప్రస్తుతం మరో సినిమాలోనూ నటిస్తోంది. తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించే చిత్రంలోనూ నిధి హీరోయిన్ గా నటిస్తోంది. హిందీలోనూ శ్రీనారాయణ్ సింగ్ తెరకెక్కించే చిత్రంలోనూ నటిస్తోంది. ఇలా ఫుల్ క్రేజ్ లో ఉండగానే కేఎల్ రాహుల్ తో ఆమె కు ఎఫైర్ అంటగట్టారు. దీనిపై తాజాగా నోరు విప్పింది.