Begin typing your search above and press return to search.
నిధి `డిస్ట్రిబ్యూట్ లవ్`.. కోవిడ్ బాధితుల సేవ కోసం
By: Tupaki Desk | 26 May 2021 6:30 AM GMTసెకండ్ వేవ్ ప్రమాద తీవ్రతను చూశాక సెలబ్రిటీలు మరోసారి అలెర్టయ్యారు. తమవంతుగా కోవిడ్ బాధితులకు సాయం చేసేందుకు ఎవరికి వారు నిధి సేకరణ కార్యక్రమాల్ని చేపడుతున్నారు. చిరంజీవి- సోనూసూద్ తదితరులు ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ఉన్నారు. అందాల కథానాయికలు ఇటీవల చిన్న మొత్తాల నిధి సేకరణతో సాయానికి ప్రయత్నిస్తున్నారు.
రకుల్ ప్రీత్ ఇటీవలే తాను చిన్న మొత్తాలను సేకరించి అవసరంలో ఉన్నవారికి సాయపడేందుకు నిధితో బ్యాంక్ ను ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. షామా శికందర్ వంటి తారలు ఇదే బాటలో సాయానికి ముందుకొచ్చారు.
తాజాగా ఇస్మార్ట్ శంకర్ ఫేం నిధి అగర్వాల్ `డిస్ట్రిబ్యూట్ లవ్` అనే నిధి సేకరణ సంస్థను ప్రారంభించనున్నారు. ఇది కోవిడ్-సంబంధిత అన్ని సహాయాలకు వన్ -స్టాప్ గమ్యస్థానంగా ఉంటుంది. తమ వెబ్ సైట్ ద్వారా వచ్చే ప్రతి అభ్యర్థనను పరిశీలించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసామని నిధి తెలిపారు. అభ్యర్థనలు పరిశీలించి నేను వారికి ఏమైనా సహాయం అందించాలనేదే నా ఉద్ధేశం. ఇది ప్రాథమిక అవసరాలైన మందులు లేదా ఆహారం వగైరా ఏవైనా కావచ్చు.. అని తెలిపారు.
కోవిడ్ కష్ట కాలంలో నాతో కలిసి ఒక బృందం పని చేస్తోంది. మేము వస్తువులను అవసరమైన వారికి అందించగలం. త్వరలోనే అభ్యర్థనలను పరిశీలిస్తాం. ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తాము.. అని అన్నారు. తెలుగు-తమిళం-హిందీలో నిధి కథానాయికగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.