Begin typing your search above and press return to search.

డార్లింగ్ తో నిధి అగ‌ర్వాల్...మారుతి అన్ హ్యాపీనా!

By:  Tupaki Desk   |   22 Dec 2022 2:30 AM GMT
డార్లింగ్ తో నిధి అగ‌ర్వాల్...మారుతి అన్ హ్యాపీనా!
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో 'రాజా డీల‌క్స్' అన‌ధికారిక టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కు తోన్న సంగ‌తి తెలిసిందే. చ‌డిచ‌ప్పుడు లేకుండా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించి మారుతి డార్లింగ్ అభిమాను లంద‌రికీ షాక్ ఇచ్చారు. ఇప్ప‌టికే రెండు వారాల షూటింగ్ కూడా పూర్తి చేసారు. ఆ షూట్ లో ప్ర‌భాస్ కూడా పాల్గొన్నారు.

ఆయ‌న స‌హా హీరోయిన్ల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. డార్లింగ్ స‌హా క‌థ డిమాండ్ చేయ‌డంతో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్న‌సంగ‌తి తెలిసిందే. నిధి అగ‌ర్వాల్...మాళ‌వికా మోహ‌న‌న్.. రిధ్ది కుమార్ ల‌తో డార్లింగ్ రొమాన్స్ చేస్తున్నాడు. ఈ న‌లుగ‌రు కాంబినేష‌న్ లోనే మారుతి కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఈసినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టిగ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో ప్ర‌భాస్ కి జోడీగి నిధి అగ‌ర్వాల్ ఏమాత్రం సెట్ అవ్వ‌డం లేదు. రెండు వారాల షూటింగ్ పుటేజీ చెక్ చేసుకున్న మారుతి నిధి సెట్ అవ్వ‌డం లేద‌ని.. ఆకాంబో లో స‌న్నివేశాల‌పై అసంతృప్తిగా ఉన్నారుట‌. దీంతో నిధి అగ‌ర్వాల్ ని సినిమా నుంచి తొల‌గించిన‌ట్లు వినిపిస్తుంది. ఇప్పుడామె స్థానంలో మెహ్రీన్ పిర్జాదాని తీసుకోవాల‌ని భావిస్తున్నారుట‌.

అయితే నిధి అగ‌ర్వాల్ ఎంట్రీ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అధికారిక స‌మ‌చారం లేదు. డార్లింగ్ స‌ర‌స‌న ఇందులో న‌టిస్తుంద‌ని మీడియా ప్ర‌చారం త‌ప్ప‌! మారుతి గానీ నిర్మాణ సంస్థ గాని విషయాన్ని అధికారికంగా చెప్ప‌లేదు. ఈ నేప‌థ్యంలో నిజంగా సినిమాలో న‌టిస్తుందా? న‌టిస్తే కావాల‌ని త‌ప్పించారా? అన్న‌ది కూడా ఎలాంటి క్లారిటీ లేదు. మరి లోలోప‌ల అస‌లేం జ‌రుగుతుంద‌న్న‌ది టీమ్ కే తెలియాలి.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ మారుతి సినిమాతో పాటు మ‌రో రెండు సినిమా షూటింగ్ ల్లో కూడా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో 'ప్రాజెక్ట్ -కె'లో న‌టిస్తున్నారు. అలాగే ప్ర‌శాంత్ నీల్ తో క‌లిసి 'స‌లార్' షూటింగ్ చేస్తున్నారు. ఈ రెండింటి మ‌ధ్య‌లోనే మారుతి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.