Begin typing your search above and press return to search.

అది చూశాకే ఆఫ‌ర్ ఇస్తారు.. నిధి సంచ‌ల‌నం!

By:  Tupaki Desk   |   15 Oct 2022 6:21 AM GMT
అది చూశాకే ఆఫ‌ర్ ఇస్తారు.. నిధి సంచ‌ల‌నం!
X
నిధి అగర్వాల్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 2015లో 'మున్నా మైకెల్' అనే హిందీ మూవీతో సినీ రంగ‌ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అఖిల్ అక్కినేనికి జోడిగా 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటించింది. కానీ అక్కినేని అన్నదమ్ములిద్దరూ నిధికి హిట్ అందించలేక పోయారు.

అయితే రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ తెర‌కెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీ తో నిధి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతోనే నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఈ మూవీ తర్వాత నిధి అగర్వాల్ ద‌శ తిరిగినట్టే అని అందరూ భావించారు. కానీ ఆమె కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటిస్తోంది. ఈ పిరియాడికల్ యాక్షన్ మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో సైతం నిధి భాగమైంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇండస్ట్రీలో హీరోయిన్ ను కేవలం గ్లామర్ షో కోసమే అన్నట్లు చూస్తారు అంటూ నిధి అగర్వాల్ సంచలన కామెంట్స్ చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ మాత్రం ఉంటే సరిపోద‌ని, అందం కూడా ఉండాలంటూ పేర్కొంది. దాదాపు అందరూ హీరోయిన్ అందంగా ఉందా..? లేదా..? అన్నది చూశాకే ఆఫర్ ఇస్తార‌ని.. కేవలం టాలెంట్ చూసి అవకాశాలు ఇచ్చే వారు చాలా తక్కువ మంది ఉన్నారంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో హీరోయిన్ పని గ్లామ‌ర్ షో చేయడం.. ప్రేక్షకులు చూసేది కూడా అదే. అందుకే తాను గ్లామర్ షో చేయడానికి ఏమాత్రం వెనుకాడను అంటూ నిధి అగర్వాల్ తెలిపింది.

అలాగే పెద్ద హీరోలతో సినిమా చేస్తే ఆ తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయని, అందుకే పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం వస్తే అసలు వదులుకోన‌ని వివ‌రించింది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎలాంటి డిమాండ్స్ చేయన‌ని.. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాన‌ని, కాక‌పోతే నా మినిమమ్ అమౌంట్ ఇంత‌ అని చెప్పేస్తాన‌ని పేర్కొంది. దీంతో నిధి అగ‌ర్వాల్ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.