Begin typing your search above and press return to search.

చేతులారా కెరీర్ ను నాశ‌నం చేసుకుంటున్న అందాల నిధి

By:  Tupaki Desk   |   13 Jun 2022 7:30 AM
చేతులారా కెరీర్ ను నాశ‌నం చేసుకుంటున్న అందాల నిధి
X
హైద‌రాబాద్ లోని ఓ మార్వారీ కుటుంబంలో జ‌న్మించిన నిధి అగ‌ర్వాల్‌.. 'మున్నా మైకెల్' అనే హిందీ మూవీతో సినీరంగ ప్ర‌వేశం చేసింది. నాగ‌చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ 'సవ్యసాచి'తో నిధి టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోయినా నిధికి మాత్రం న‌ట‌న మ‌రియు లుక్స్ ప‌రంగా మంచి మార్కులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత ఒక‌ట్రెండు సినిమాలు చేసినా.. అవి ఆమెను స‌క్సెస్ ట్రాక్ ఎక్కించ‌లేక‌పోయాయి.

కానీ, టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' మూవీ నిధి అగ‌ర్వాల్ కు తొలి హిట్ ప‌డేలా చేసింది. ఈ మూవీ అనంత‌రం నిధి ద‌శ తిరిగిన‌ట్టే అని అంద‌రూ భావించారు. కానీ, అది జ‌ర‌గ‌లేదు. ఆఫ‌ర్లు కూడా అంతంత మాత్రంగానే వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ అందాల భామ తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న 'హరి హర వీరమల్లు' అనే పీరియాడికల్ మూవీలో న‌టిస్తోంది.

క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీపై నిధి భారీ ఆశ‌లే పెట్టుకుంది. ఇక‌పోతే రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో నిధి మాట్లాడుతూ.. 'ఓటీటీల నుంచి నాకెన్నో అవకాశాలు వస్తున్నాయి. కానీ, నేనే వాటిని వ‌దులుకుంటున్నా. హీరోయిన్ గా నా తొలి ప్రాధాన్యత‌ సినిమానే.

తెలుగమ్మాయిని కావ‌డం వ‌ల్ల ఇతర భాషలకన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొన‌సాగ‌డ‌మే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి సినిమాతోనూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నా. కొన్ని సినిమాలు గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చాయి. అయితే డీగ్లామర్ పాత్ర‌లు చేయ‌డానికీ నేను సిద్ధ‌మే' అంటూ చెప్పుకొచ్చింది. అంతా బాగానే ఉంది కానీ.. ఓటీటీ ఆఫ‌ర్ల‌ను రిజెక్ట్ చేయ‌డ‌మే నిధి చేస్తున్న పొర‌పాటని అంటున్నారు సినీ విశ్లేష‌కులు.

ఎందుకంటే, క‌రోనా త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన ప‌ని లేదు. స్టార్ హీరో, హీరోయిన్లు సైతం ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు ఓటీటీల వేదిక‌గా వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఓటీటీ వేదిక‌గా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైతే.. హీరోయిన్ గా ఆఫ‌ర్లు పెరిగే అవ‌కాశాలు ఎంతైనా ఉన్నాయి.

కానీ, నిధి మాత్రం ఓటీటీ నుంచి మంచి మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నా.. వ‌దులుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే చేతులారా నిధి కెరీర్ ను నాశ‌నం చేసుకుంటోంద‌ని అంటున్నారు. హీరోయిన్ గా కెరీర్ ఎలాగో డౌన్ అవుతోంది, ఇలాంటి త‌రుణంలో ఓటీటీ ఆఫ‌ర్ల ద్వారా అయినా పుంజుకుంటే మంచిద‌ని నెటిజ‌న్లు భావిస్తున్నారు.