Begin typing your search above and press return to search.

వీరమల్లు మైండ్‌ బ్లోయింగ్‌ అంటోంది

By:  Tupaki Desk   |   8 Aug 2021 11:38 AM GMT
వీరమల్లు మైండ్‌ బ్లోయింగ్‌ అంటోంది
X
పవన్‌ కళ్యాణ్‌.. క్రిష్ ల కాంబోలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా కోసం అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్ మొదటి సారి ఒక విభిన్నమైన గెటప్ ను ట్రై చేస్తున్నాడు. ఛారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాను ఇప్పటి వరకు పవన్ చేయలేదు. మొదటి సారి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్‌ కళ్యాణ్‌ సరికొత్త రికార్డును సృష్టించడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. క్రిష్ దర్శకత్వం అవ్వడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అనే నమ్మకంతో అభిమానులు ఉండగా తాజాగా చిత్రంలో హీరోయిన్‌ గా నటిస్తున్న నిధి అగర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

ఇటీవల ఒక చిట్‌ చాట్ లో నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ.. తనకు హరి హర వీరమల్లు మూవీలో ఛాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఇక సినిమా ఎలా తెరకెక్కుతుంది అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు గాను ఆమె ప్రతి సన్నివేశం... ప్రతి ఎలిమెంట్‌ కూడా మైండ్ బ్లోయింగ్‌ గా దర్శకుడు క్రిష్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతి సన్నివేశం కూడా మైండ్‌ బ్లోయింగ్‌ అన్నట్లుగా ఉంటుందని నిధి అగర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను పవన్‌ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. సినిమాపై వారు పెట్టుకున్న అంచనాలను నిధి అగర్వాల్‌ వ్యాఖ్యలు మరింతగా పెంచే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

నిధి అగర్వాల్‌ ఇస్మార్ట్‌ శంకర్ సినిమాతో సక్సెస్‌ ను దక్కించుకుని మళ్లీ మరో బిగ్గెస్ట్‌ సక్సెస్ కోసం వెయిట్‌ చేస్తోంది. ప్రస్తుతం పలు సినిమాల్లో ఆమె నటిస్తున్నా కూడా పూర్తిగా ఆమె హోప్స్ మాత్రం ఈ సినిమాపైనే అనడంలో సందేహం లేదు. హరి హర వీరమల్లు సినిమా తర్వాత ఆమె స్థాయి అమాంతం పెరిగి పోవడం ఖాయం.. ఇండస్ట్రీలో టాప్ స్టార్‌ హీరోలకు ఆమె మోస్ట్‌ వాంటెడ్‌ అవ్వడం కూడా ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అంటున్నారు. హరి హర వీరమల్లు సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటే సెకండ్‌ వేవ్‌ వల్ల క్యాన్సిల్‌ అయ్యింది. షూటింగ్‌ ను అతి త్వరలో పునః ప్రారంభించి వచ్చే సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.