Begin typing your search above and press return to search.

అలాంటి వారికే అవకాశాలు ఎక్కువంటున్న నిధి అగర్వాల్..!

By:  Tupaki Desk   |   22 Oct 2022 7:30 AM GMT
అలాంటి వారికే అవకాశాలు ఎక్కువంటున్న నిధి అగర్వాల్..!
X
స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ఫార్ములాతో వస్తున్న అవకాశాలను చేసుకుంటూ వెళ్తుంది ఉత్తరాధి భామ నిధి అగర్వాల్. అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య, అఖిల్ ఇద్దరితో సినిమాలు చేసిన నిధి అగర్వాల్ ఆ సినిమాలు నిరాశపరచడంతో కెరియర్ రిస్క్ లో పడ్డది. ఆ టైం లోనే పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ అమ్మడికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాలో మరో హీరోయిన్ నభా నటేష్ ఉన్నా కూడా నిధి గ్లామర్ షోకి ఎక్కువ మార్కులే పడ్డాయి.

ఆ సినిమాతో కెరియర్ జోష్ వచ్చినా ఆ తర్వాత మళ్లీ యదావిధిగానే ఆఫర్లు లేకుండాపోయాయి. ఇక ఖాళీగా ఎందుకని గల్లా అశోక్ తొలిపరిచయంగా చేసిన హీరో సినిమాలో నటించింది నిధి అగర్వాల్.

ఈ గ్యాప్ లో కోలీవుడ్ షిఫ్ట్ అయిన అమ్మడు అక్కడ జయం రవి, శింబు లాంటి స్టార్ హీరోలతో నటించి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో కన్నా తమిళంలో ఎక్కువ పాపులర్ అయ్యింది నిధి అగర్వాల్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన సినీ జర్నీపై స్పందిస్తూ.. సినిమాల్లో 20 శాతం నటనకు, 80 శాతం అందానికి ప్రాముఖ్యత ఉంటుందని చెప్పింది.

కేవలం టాలెంట్ ఉంటేనే ఛాన్సులు వస్తాయంటే తాను ఒప్పుకోను.. గ్లామర్ మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్.. స్కిన్ షో చేస్తేనే ఇక్కడ అవకాశాలు వస్తాయని అంటుంది అగర్వాల్ భామ. అంతేకాదు తనలాంటి వారు రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా డిమాండ్ చేయరు అందుకే పెద్ద సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయని చెబుతుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్ ఆ ప్రాజెక్ట్ పై చాలా హోప్స్ పెట్టుకుంది. క్యారక్టర్ డిమాండ్ చేయాలే కానీ ఎలాంటి సీన్స్ అయినా చేసేందుకు రెడీ అంటున్న నిధి అగర్వాల్ మిగతా హీరోయిన్స్ లా రెమ్యునరేషన్ గురించి కూడా పెద్దగా డిమాండ్ చేయనని చెబుతుంది.

అందుకే తనకు వరుస అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ టైం లోనే ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోయిన నిధి హరి హర వీరమల్లు సినిమా తర్వాత అయినా తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అమ్మడు ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.