Begin typing your search above and press return to search.
ముద్దుగుమ్మ దృష్టిలో ఉన్న ముగ్గురు హీరోలు వీరే!
By: Tupaki Desk | 13 Jan 2022 1:30 AM GMTఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఏ హీరోయిన్ ను పట్టుకుని, మీ అభిమాన హీరో ఎవరు? ఎవరితో యాక్ట్ చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నారు? అని అడిగితే, ప్రభాస్ తో మొదలుపెట్టి ముందు వరుసలో ఉన్న అందరి హీరోల పేర్లు చెబుతుంది. అడిగే యాంకర్ .. చెప్పే హీరోయిన్ మారతారేమోగాని, ఈ సమాధానం మాత్రం మారదు. ఇంకా నయం నిధి అగర్వాల్ తనకంటూ ఒక క్రేజ్ వచ్చిన తరువాత, తనకి ఏ హీరోలతో కలిసి నటించాలని ఉందనేది చెప్పింది. అంతేకాదు కేవలం ముగ్గురు హీరోల పేర్లు మాత్రమే చెప్పి వదిలేయడం కూడా ఆశ్చర్యమే.
చందమామకి పాల మీగడ పూసినట్టుగా కనిపించే ఈ బ్యూటీ, అశోక్ గల్లా జోడీగా చేసిన 'హీరో' ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనకి ఎన్టీఆర్ .. చరణ్ .. అల్లు అర్జున్ లతో నటించాలని ఉందని చెప్పింది. మరి ప్రభాస్ .. మహేశ్ తో చేసే ఛాన్స్ వస్తే చేయదా? అనే డౌట్ అవసరం లేదు. 'ముందుగా వీళ్లతో చేయని .. వాళ్ల సంగతి తరువాత చూద్దాం' అనుకుని ఉండొచ్చు. లేదంటే ఈ ఆర్డర్ పూరయ్యేసరికి వాళ్ల సినిమాల నుంచి పిలుపులు ఉంటాయనే నమ్మకం కావొచ్చు.
ఇక ఈ సుందరి 'హీరో' సినిమాను గురించి ప్రస్తావిస్తూ ... " ఈ సినిమాలో నేను డాక్టర్ పాత్రలో కనిపిస్తాను. రెండు కుటుంబాల మధ్య జరిగే ఆసక్తికరమైన డ్రామా ఇది. మొదటి నుంచి చివరి వరకూ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లవ్ .. కామెడీ .. యాక్షన్ ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. మొదటి సినిమానే అయినా అశోక్ చాలా అనుభవం ఉన్నవాడిలా చేశాడు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎక్కడికి వెళ్లినా 'హరి హర వీరమల్లు' గురించే అడుగుతున్నారు.
'వీరమల్లు' నేను యాక్షన్ సీన్స్ లోను కనిపిస్తాను. మొదటి నుంచి కూడా నాకు యాక్షన్ సీన్స్ చేయడం ఇష్టం. అందుకు తగినట్టుగానే ఈ సినిమాలో అవకాశం రావడం అదృష్టం. నా కెరియర్లోనే ఆ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే నమ్మకం ఉంది. నా గ్లామర్ విషయానికి వస్తే .. నేను చాలా మితంగా ఆహరం తీసుకుంటాను .. అదీ శాకాహారం మాత్రమే. ఫిట్ నెస్ కోసం ప్రతి రోజు 45 నిమిషాలు వర్కౌట్స్ చేస్తాను. వైవిధ్యభరితమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాను. ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. ఇక తమిళంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాను. హిందీ సినిమా ఒకటి ఏప్రిల్ నుంచి మొదలవుతుంది" అంటూ చెప్పుకొచ్చింది.