Begin typing your search above and press return to search.

ఆ పిల్లను అలా చూపిస్తావా చందూ?

By:  Tupaki Desk   |   24 Nov 2017 10:09 AM GMT
ఆ పిల్లను అలా చూపిస్తావా చందూ?
X
హీరోయిన్లను ఆన్ స్క్రీన్ పై చూపించడంలో ఒక్కో దర్శకుడికి ఒకో రకమైన టేస్ట్ ఉంటుంది. కొందరు హోమ్లీ క్యారక్టర్లుగా హీరోయిన్ పాత్రలను మలుస్తారు. సినిమాను నడిపించే క్యారెక్టర్లు కొందరికి నచ్చుతాయి.. గ్లామరస్ యాంగిల్ లో.. అల్ట్రా మోడర్న్ స్టయిల్ లో.. ఇలా ఎవరి టేస్ట్ వారికి ఉంటుంది. కొందరైతే ఒక్కో చిత్రంలో ఒకో రకంగా చూపేందుకు ప్రయత్నిస్తారు.

యువ దర్శకుడు చందూ మొండేటికి కూడా పర్టిక్యులర్ టేస్ట్ ఉంది. ఈ డైరెక్టర్ తన హీరోయిన్లను పద్ధతిగానే చూపేందుకు ఇష్టపడతాడు. గతంలో కార్తికేయ చిత్రంలో స్వాతి.. ప్రేమమ్ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ను హోమ్లీగా చూపించి అలరించాడు ఈ దర్శకుడు. గ్లామర్ పాత్రలను ఇష్టపడే శృతి హాసన్ ను కూడా.. కేరక్టర్ ప్రకారం పద్ధతిగానే చూపించాడు. ఈ డైరెక్టర్ ఇప్పుడు అల్ట్రా మోడర్న్ అమ్మాయి అయిన నిధి అగర్వాల్ తో మూవీ చేస్తున్నాడు. చైతన్య అక్కినేని పక్కన సవ్యసాచిలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాదే వచ్చిన మున్నా మైఖేల్ చిత్రంలో నిధి అగర్వాల్ చూపిన గ్లామర్ అంతా ఇంతా కాదు.

కానీ సవ్యసాచి చిత్రంలో సాంప్రదాయంగా కనిపించనుందట ఈ హీరోయిన్. పూర్తి విభిన్నమైన క్యారెక్టర్ చేస్తున్నందుకు ఫుల్ ఖుషీగా ఉందంటున్న నిధి.. దక్షిణాది సినిమాలకు నార్త్ లో ఉన్నంత డిమాండ్.. ఉత్తరాది సినిమాలకు సౌత్ లో లేకపోవడం తాను గమనించానని అంటోంది.