Begin typing your search above and press return to search.

ఈత కొలనులో కొత్త కలువ

By:  Tupaki Desk   |   1 Sept 2017 4:51 AM
ఈత కొలనులో కొత్త కలువ
X
టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది నిధి అగర్వాల్. సాధారణంగానే కొత్త అందానికి వెల్ కం చెప్పే బాలీవుడ్ ఆమెకు సాదర స్వాగతమే పలికింది. మున్నా మైఖేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో ఈ అమ్మడికి ఇంకా సరైన గుర్తింపు రాలేదు. వెండితెరపై అందచందాలు ఆరబోయడంలో ఏ మాత్రం మొహమాట పడేది లేదంటూ చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తోంది.

రీసెంట్ గా హాలిడే ట్రిప్ కోసం గోవా వెళ్లిన నిధి అగర్వాల్ అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో టూ పీస్ బికినీతో స్విమ్మింగ్ పూల్ లో తిరుగుతూ ఈ సుందరాంగి ఇచ్చిన ఫోజులు చూస్తే చలికాలంలోనూ చెమటలు పట్టాల్సిందే. మున్నా మైఖేల్ సినిమా కోసం 300 మందిలో నుంచి డైరెక్టర్ సాబిర్ ఖాన్ ఆమెను ఏరికోరి ఎందుకు ఎంపిక చేసుకున్నాడో ఈ ఫొటోలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. అందం.. ఆకారం.. రూపం.. లావణ్యం అన్నీ ఉన్న ఈ అమ్మడికి ప్రస్తుతం కలిసిరానిదల్లా కాలమే. ఫిలిం మేకర్స్ కు తన దగ్గర ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో తెలిసేలా అద్భుతమైన ఫోజులిచ్చింది. త్వరలో అవకాశాలు తనను వెతుక్కుంటూ వస్తాయని నిధి ఆశలు నిజమవడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు.

నిధి అగర్వాల్ తల్లిదండ్రులు నార్త్ వాళ్లే అయినా తను పుట్టి పెరిగింది బెంగుళూరులోనే. దానికితోడు నిధి మంచి డ్యాన్సర్ కూడా. కథక్ నాట్యంలో మంచి పట్టుంది. ఇవన్నీ ఇక్కడ ప్లస్సయ్యే అంశాలే కాబట్టి సౌత్ సినిమాల వైపు కూడా ఓ చూపు చూస్తే సరి...