Begin typing your search above and press return to search.

స్నేహితుడు ఘాటైన చుంబ‌నం!

By:  Tupaki Desk   |   16 April 2019 8:08 AM GMT
స్నేహితుడు ఘాటైన చుంబ‌నం!
X
బాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌లంద‌రికీ అత‌డే మేక‌ప్.. హెయిర్ డిజైన‌ర్. రూ.కోట్ల‌లో వార్షికాదాయం ఆర్జించే టాప్ ఎర్న‌ర్ .. టీవీ - సినిమా ఆర్టిస్టులు.. టాప్ మోడ‌ల్స్ కు ఆయ‌నే ప‌ర్స‌న‌ల్ డిజైన‌ర్. యంగ్ గాళ్స్ లో అత‌డంటే విప‌రీత‌మైన క్రేజు.. లండ‌న్ స‌హా విదేశాల్లో మేక‌ప్- హెయిర్ డిజైన్ క్లాసులు చెబుతుంటాడు. లోక‌ల్ బిజినెస్ వేరు.. విదేశాల్లో బిజినెస్ లు వేరే. టాలీవుడ్ బ్యూటీస్ తో బిగ్ క‌నెక్ష‌న్ ఉన్న మేక‌ప్ ఆర్టిస్టు.. ఇంత‌కీ ఆయ‌న పేరేమిటి అంటే షాన్ అలియాస్ షాన్ ముట్టాతిల్. అత‌డి క్రేజు ఇంట‌ర్నేష‌న‌ల్.

అయితే ఆయ‌న ఇంట్ర‌డ‌క్ష‌న్ ఎందుకు? అంటే స‌ద‌రు మేక‌ప్ ఆర్టిస్టుతో బెంగ‌ళూరు బ్యూటీ నిధి అగ‌ర్వాల్ స్నేహంపై ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర వార్త‌లు వ‌చ్చాయి. నిధి అత‌డితో ఎంత క్లోజ్ అనేదానికి ప్రూఫ్ గా ఈ అమ్మ‌డితో ఘాటైన చుంబ‌నానికి సంబంధించిన ఫోటోలు.. త‌న‌తో క‌లిసి పూల్ లో స్విమ్మింగ్ చేసిన ఫోటోలు వెబ్ లో జోరుగా వైర‌ల్ అయ్యాయి. తాజాగా షాన్ త‌న‌ బుగ్గ‌పై ఘాటుగా చుంబిస్తున్న ఓ ఫోటోని సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేసి ఆస‌క్తిక‌ర‌మైన కొటేష‌న్ ఇచ్చింది నిధి. ``జీఎస్‌ టీ రీయూనియ‌న్.. ఈ రెండూ ప్రేమ‌తో`` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. షాన్ నుంచి ఓ రిప్ల‌య్ వ‌చ్చింది. ``బ‌బ్బూ... మ‌ళ్లీ మ‌నం అది చేశాం. ఒక ప‌గ‌లు.. ఒక రేయి అంతా గుర్తుండేలా.. ల‌వ్ యు లైక్ క్రేజీ.. యు ఆర్ మై స్పెష‌ల్ గాళ్‌`` అంటూ `ల‌వ్‌`ఈమోజీతో షాను రిప్ల‌య్ ఇచ్చారు.

అయితే షాన్ త‌న‌కు గుడ్ ఫ్రెండ్ మాత్ర‌మేన‌ని నిధి చెబుతుంటుంది. ఇక‌పోతే ఈ ట్యాలెంటెడ్ గ‌య్‌ కి నిధిలానే చాలా మంది గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో జాక్విలిన్ ఫెర్నాండెజ్.. యూట్యూబ్ స్టార్ అమండా సెర్నీ.. సోఫీ చౌద‌రి.. దీపా ఖోస్లా .. ఇస‌బెల్లా కైఫ్.. శ్ర‌ద్దా క‌పూర్ ఇలా ఎంద‌రో సెల‌బ్రిటీలు అత‌డికి క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లంద‌రికీ అత‌డు మేక‌ప్ డిజైన‌ర్ గానూ ప‌ని చేశాడు. ఇండ‌స్ట్రీలో సంబంధాల్ని ఎఫైర్ గానూ అన్ని సంద‌ర్భాల్లో భావించ‌లేం. మ‌రి షాన్ తో స్నేహంపై నిధి ఇంకాస్త డీటెయిల్స్ ఇస్తుందేమో చూడాలి.