Begin typing your search above and press return to search.
బ్యాక్ లెస్ ఫోజులో కవ్వించిన ఇస్మార్ట్ నిధి
By: Tupaki Desk | 13 Jun 2021 4:30 AM GMTసెకండ్ వేవ్ కష్టకాలంలో చాలామంది కథానాయికల మానవతా సాయం చేసేందుకు ముందుకు రావడం ప్రముఖంగా చర్చకు వస్తోంది. ఇక బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ తనవంతుగా నిధి సేకరణ కార్యక్రమాల్ని చేపట్టి ప్రజలకు సాయపడేందుకు ప్రయత్నించారు. నిధి అగర్వాల్ తన స్థాయికి తగ్గట్టు ఇదివరకూ ఆర్థిక విరాళాల్ని అందించిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఇస్మార్ట్ నిధి అగర్వాల్ `డిస్ట్రిబ్యూట్ లవ్` అనే నిధి సేకరణ సంస్థను ప్రారంభించి కోవిడ్-సంబంధిత అన్ని సహాయాలకు వన్ -స్టాప్ గమ్యస్థానంతో వెబ్ సైట్ ద్వారా వచ్చే ప్రతి అభ్యర్థనను పరిశీలించి సాయం చేసేందుకు సంకల్పించారు. కరోనా రోగులకు ప్రాథమిక అవసరాలైన మందులు లేదా ఆహారం అందిస్తున్నారు.
మరోవైపు నిధి అగర్వాల్ సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉన్నారు. తాజాగా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ లో బ్యాక్ లెస్ ఫోజులో నిధి మైమరిపిస్తోంది. నిధి దేవతా సుందరిని తలపిస్తోంది అంటూ కితాబిచ్చేస్తున్నారు యూత్. కెరీర్ మ్యాటర్ కి వస్తే..ఇటీవలే పవన్ హరి హర వీరమల్లులో ఓ కీలక పాత్రను పోషిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అటు తమిళంలోనూ నిధి అగర్వాల్ కథలు వింటున్నారని తెలిసింది.