Begin typing your search above and press return to search.

కిల్ల‌ర్ లుక్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న నిధి

By:  Tupaki Desk   |   3 Jan 2022 5:30 PM GMT
కిల్ల‌ర్ లుక్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న నిధి
X
అక్కినేని హీరోల స‌ర‌స‌న తెరంగేట్రం చేసిన నిధి అగ‌ర్వాల్ ఆ త‌ర్వాత `ఇస్మార్ట్ శంక‌ర్` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. పూరీ భారీ స‌క్సెస్ ఇచ్చినా తెలుగులో కెరీర్ ప‌రంగా వెన‌క‌బ‌డింది. కోలీవుడ్ లో ఓ రెండు సినిమాలు చేసింది. ఈ సంక్రాంతి బ‌రిలో నిధి న‌టించిన హీరో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అలాగే ప‌వ‌న్ స‌ర‌స‌న `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` లో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇందులో అమ్మ‌డు పంచ‌మి పాత్ర‌లో న‌టిస్తోంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 2022లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కెరీర్ నెమ్మ‌దిగా సాగుతున్నా.. సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌కు నిరంత‌రం ట‌చ్ లోనే ఉంది నిధి. తాజాగా ఈ బ్యూటీ హాట్ ఫోటోషూట్ ని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. నిధి అలా స్పెష‌ల్ బ్రౌన్ కోట్ ని ధ‌రించి తీక్ష‌ణంగా చూస్తోంది. కాలుపై కాలు వేసి థైసొగ‌సుల‌ను వ‌డ్డించిన తీరుకు యూత్ ఫిదా అనే చెప్పాలి. ఇక‌పై త‌న సినిమాల‌ను ప్ర‌మోట్ చేసేందుకు నిధి సిద్ధంగా ఉంది. మీడియా చాటింగుల‌తోనూ బిజీ అవుతోంది.

ఒక్క హిట్ ప‌డితే తిరిగి స్పీడ్ పెంచేస్తుంది. ఇక అందాల ఆర‌బోత‌కు ఎంత‌మాత్రం సంకోచించ‌ని నిధికి యువ‌హీరోలు అవ‌కాశాలిచ్చి ఆదుకోవ‌డం కొంత‌వ‌ర‌కూ ఊర‌ట‌. అలాగే బాలీవుడ్ లోనూ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తున్నా ఎందుక‌నో అది అంత సులువుగా కుద‌ర‌డం లేదు. ఒకే ఒక్క బ్ల‌క్ బ‌స్ట‌ర్ త‌న‌కు ఇప్పుడు అవ‌స‌రం. దానికోస‌మే వెయిటింగ్ ఈ బ్యూటీ.