Begin typing your search above and press return to search.

తన పరువాలను చూస్తూ ఉండిపో.. అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ!

By:  Tupaki Desk   |   30 Jun 2020 11:30 PM GMT
తన పరువాలను చూస్తూ ఉండిపో.. అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ!
X
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరంటే వారు హీరోయిన్ అయిపోరు. కొందరేమో అదృష్టం కొద్ది హీరోయిన్ అవుతారు. మరికొందరేమో ముందే అనుకొని హీరోయిన్ అవుతారు. ఇంకొందరేమో ఎక్స్పెక్ట్ చేయకుండానే హీరోయిన్ అయిపోతారు. ఇందులో రెండో కోవకు చెందిందే నిధి అగర్వాల్. అంటే ఈ అమ్మడు చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కంటూ పెరిగింది. అనుకున్నట్లుగానే మోడలింగ్ లో రాణించి సినిమా అవకాశాలు చేజిక్కించుకుంది. మున్నా మైకేల్ సినిమాతో హీరోయిన్ అయిన ఈ భామ ఆ వెంటనే సౌత్ ఇండస్ట్రీ వైపు మళ్ళింది. కానీ కొందరు హీరోయిన్లకి పట్టుదల పరువాలతో పాటు అదృష్టం కూడా కొంత కావాల్సి ఉంటుంది. నిధి విషయంలో మాత్రం అదృష్టం ఆవగింజంత కూడా లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే నిధి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఆమెకు కొంచం కూడా గుర్తింపు తీసుకు రాలేకపోయాయి.

అయితే తెలుగులో గతేడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొదటి హిట్టును తన ఖాతాలో వేసుకుంది నిధి. ఈ సినిమాతో గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. ముఖ్యంగా జిల్లెలమ్మ జిట్టా.. ఉండిపో లాంటి పాటలలో ఆమె అందాల ఆరబోత మాములుగా లేదు. అందుకే కుర్రకారు అలా ప్లాట్ అయిపోయారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన నిధి.. సోషల్ మీడియాలో వేడెక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తుంది. ఫ్యాషన్ డ్రెస్సింగ్ స్టైల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ భామ.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో పిక్ పెట్టింది. అంతే అభిమానులకు కన్నుల పండుగే అవుతుందని చెప్పాలి. ఆ మోడరన్ డ్రెస్సులో అమ్మడి అందాలు కనిపించి కనిపించినట్లు.. చూపించి చూపించనట్లుగా ఊరిస్తున్నాయి. మరి కుర్ర హృదయాలు ఊరుకుంటాయా.. అలా కళ్లప్పగించి ఉండిపోతున్నారంతే. ప్రస్తుతం అమ్మడు గల్లా జయదేవ్ కొడుకు అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమాలో నటిస్తోంది.