Begin typing your search above and press return to search.

ఆట మొదలైంది అంటున్న నిధి!

By:  Tupaki Desk   |   15 May 2020 1:10 PM GMT
ఆట మొదలైంది అంటున్న నిధి!
X
ఈ లాక్ డౌన్ సమయాన్ని ఒక్కొకరు ఒక్కో రకంగా గడుపుతున్నారు. సెలబ్రిటీలలో కొందరు తమ ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తూ కసరత్తులు చేస్తున్నారు. ఆ వీడియోలు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేస్తున్నారు. కొందరేమో వంటగదిలో విరామం.. విశ్రాంతి లేని యుద్ధాలు ప్రకటించారు. కొందరేమో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ ఉన్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ప్రస్తుతం హాయిగా పబ్జీ గేమ్ ఆడతోందట.

ఈ మధ్య యువతరంలో తెగ పాపులర్ అయిన గేమ్స్ లో ఈ PUBG గేమ్ ఒకటి. ఒకసారి గేమ్ ఆడడం అంటూ మొదలు పెడితే టైమూ పాడూ తెలియదని.. ఓ వ్యసనంగా మారుతుందని ఈ ఆట ఆడుటలో పండిపోయిన సర్వజ్ఞులు.. యువ తత్వవేత్తలు శెలవిస్తూ ఉంటారు. ఇలా టైం ఎంతో తెలియకుండా చేసే గేమ్స్ ఈ లాక్ డౌన్ కు సరైన మందు కదా? అందుకే నిధి ఈ ఆటను ఎంచక్కా ఎంచుకుని ఆ ఎంచుకున్న విషయాన్ని ట్విట్టర్ జనాలతో పంచుకుంది.

తన మొబైల్ లో పబ్ జీ గేమ్ స్క్రీన్ షాట్ ను ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ "అండ్ ఇట్ బిగిన్స్" అంటూ ట్వీట్ చేసింది. ఈ విషయం నెటిజన్లకు తెలియగానే ఆనందంలో మునిగిపోయారు. కొందరు పబ్ జీ ప్రేమికులు నిధిని పబ్జీ ఐడీ ఇవ్వమని.. మీతో ఆడతామని కోరారు. ఏదైతేనేం.. మొత్తానికి ఈ పబ్జీతో తో ఇస్మార్ట్ బ్యూటీకి ఫుల్లు టైం పాస్ అవుతుంది.