Begin typing your search above and press return to search.

సవ్యసాచి బ్యూటి కష్టం చూశారండీ..

By:  Tupaki Desk   |   20 Feb 2018 4:48 PM GMT
సవ్యసాచి బ్యూటి కష్టం చూశారండీ..
X
కథ డిమాండ్ చేస్తే హీరోలు కండలు పెంచడానికి జిమ్ లో చాల కష్టపడుతుంటారు. హీరోయిన్స్ కూడా జిమ్ వర్కౌట్స్ బాగానే చేస్తుంటారు. అందాలలో ఈక్వల్ సైజ్ మెయింటెన్ చేయడానికి రెమ్యునరేషన్ లో సగం డబ్బుని ఖర్చుపెడుతుంటారు. గ్యాప్ దొరికితే చాలు కొంత మంది హీరోయిన్స్ నైట్ లో క్లబ్బుల్లో గడపడం కన్నా ఉదయాన్నే జిమ్ లో వర్కౌట్స్ చేయడం బెటర్ అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారిలో ఓ బెంగుళూరు బ్యూటీ కూడా చేరింది.

ఆమె ఎవరో కాదు. త్వరలోనే తెలుగు తెరకు పరిచయం కాబోతోన్న నిధి అగర్వాల్. నాగ చైతన్య కెరీర్ లోనే ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న సవ్యాసాచి అనే సినిమాలో నటిస్తోంది. ప్రేమమ్ దర్శకుడు చందు మొండేటి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే నిధి అగర్వాల్ ఈ మధ్య జిమ్ వర్కౌట్స్ కి సమయాన్ని బాగానే కేటాయిస్తోంది. ఏ మాత్రం షూటింగ్ లో గ్యాప్ వచ్చినా ఎక్కువ సమయం జిమ్ లో ఉంటూ ఫిట్నెస్ కోసమని తెగ కష్టపడుతోంది. రీసెంట్ గా పుల్ అప్స్ చేస్తోన్న ఒక వీడియోను అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

అమ్మడి కష్టం చూస్తుంటే అందంలో ఏ మాత్రం తేడా రానివ్వకుండా ఎంతగా కష్టపడుతుందో అనేలా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో గత ఏడాది మున్నా మైకేల్ అనే సినిమాలో నటించినా నిధికి అవకాశాలు ఎక్కువగా రాలేవు. మరి ఈ సినిమాతో అయినా అమ్మడి కష్టానికి తగిన ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.