Begin typing your search above and press return to search.

అవార్డ్‌ వేడుకలో అందాల నిధి

By:  Tupaki Desk   |   12 Sep 2022 3:33 PM GMT
అవార్డ్‌ వేడుకలో అందాల నిధి
X
సవ్యసాచి సినిమాతో నాగ చైతన్యతో కలిసి టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్‌ కి అనూహ్యంగా వెంటనే మిస్టర్ మజ్ను సినిమాలో నటించే అవకాశం దక్కింది. కానీ మొదటి రెండు సినిమాలు కూడా నిరాశ పర్చడంతో అందాల నిధి టాలీవుడ్‌ లో నిలదొక్కుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అనూహ్యంగా ఈ అమ్మడికి ఇస్మార్ట్‌ శంకర్‌ దక్కింది.

రామ్‌ హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్‌ శంకర్‌ విజయాన్ని సొంతం చేసుకోవడంతో టాలీవుడ్‌ లో బిజీ అవుతుందని అంతా భావించారు. కానీ కరోనా వల్ల ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్ ఈ అమ్మడు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లో విఫలం అయ్యింది. కానీ అనూహ్యంగా ఈ అమ్మడికి పవన్‌ కళ్యాణ్‌ హరి హర వీరమల్లు సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

ఆ సినిమా హిట్ అయితే కచ్చితంగా ఈ అమ్మడి స్థాయి అమాంతం పెరగడం ఖాయం. ఒక వైపు సినిమాలతో పాపులారిటీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే మరో వైపు ఈ అమ్మడు సోషల్‌ మీడియా లో హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ సందడి చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈమె సైమా అవార్డు వేడుకల్లో సందడి చేసింది.

ఆ సందర్భంగా ఈ అమ్మడు ధరించిన డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చూడ్డానికి బోటమ్‌ వరకు ఉన్నా కూడా సాధ్యం అయినంత వరకు థైస్‌ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఉంది. అంతే కాకుండా క్లీవేజ్ షో తో ఈ అమ్మడు చూపరులను కట్టి పడేసింది. పింక్ డ్రెస్ లో ఈ అమ్మడిని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండి పోవాలి అన్నట్లుగా ఉందంటూ నెటిజన్లు ఈ ఫోటోను తెగ షేర్‌ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.