Begin typing your search above and press return to search.
'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' చెప్పాలంటే పెద్ద సపోర్ట్ కావాలి!
By: Tupaki Desk | 12 Nov 2021 7:37 AM GMTనిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ పై 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సిరీస్ నిర్మించింది. సంగీత్ శోభన్ - సిమ్రాన్ జంటగా నటించిన ఈ వెబ్ సిరీస్, ఈ నెల 19వ తేదీ నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. నిన్న రాత్రి జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. "ఒక మంచి కంటెంట్ చేయడం ఎంత ఇంపార్టెంటో అది జనాల్లోకి వెళ్లేలా చూడటం అంత ఇంపార్టెంట్. అందుకోసం షూటింగు నుంచి వచ్చిన వరుణ్ తేజ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. సినిమాకి సినిమాకి ఎదుగుతున్న ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి.
మా ఫస్టు పోస్టర్ రిలీజ్ చేసిన నాగబాబు గారికీ .. మా టీజర్ రిలీజ్ చేసిన నాని సార్ కి .. మా ట్రైలర్ రిలీజ్ చేసిన నాగార్జున సార్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇవన్నీ మీకు చాలా చిన్న విషయాలై ఉండొచ్చు .. కానీ మాకు ఇది చాలా పెద్ద విషయం. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'ని చెప్పాలంటే పెద్దవాళ్ల సపోర్ట్ ఉండాలి.
ఇది ఒక సినిమానే అనే అందరూ అనుకుంటున్నారు .. సినిమాలానే చేశాము .. కానీ ఇది ఒక వెబ్ సిరీస్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక సినిమాకి ఎంతమాత్రం తక్కువ కాదు. అలా అనిపించేలా నిహారిక జాగ్రత్తలు తీసుకున్నారు.
నేను ఒక వెబ్ సిరీస్ చేయడం .. దాని ట్రైలర్ ఇక్కడ ప్లే అవుతుండటం చూస్తే నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను. నిహారిక గారు నా మీద ఒక నమ్మకం పెట్టుకుని నన్ను తీసుకున్నారు. అందుకు ఆమెకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఆమె నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను. రైటర్ మానస .. డైరెక్టర్ మహేశ్ తో కలిసి పని చేస్తుంటే, నా స్నేహితులతో కలిసి పనిచేస్తున్నట్టుగానే అనిపించింది.
మ్యూజిక్ డైరెక్టర్ పీకేగారు ఈ కథకు ఒక లైఫ్ ఇచ్చారు. నరేశ్ .. తులసి గార్లతో కలిసి నటించడం నా అదృష్టం. తులసి గారు ఎంతో సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. సెట్లో ఆమె చాలా సరదాగా ఉండేవారు. సిమ్రాన్ ఫీలైనా ఫరవాలేదు .. తులసి గారే నా హీరోయిన్.
ఇక నా కో స్టార్ సిమ్రాన్ చాలా మంచి ఆర్టిస్ట్ .. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె తెలుగు నేర్చుకున్నారు. నా డైలాగులు కూడా ఆమె చెబుతూ ఉంటే నేను ఇబ్బంది పడవలసి వచ్చేది. ఇక గెటప్ శ్రీనుతో పనిచేస్తున్నట్టుగా ఉండదు. ఎప్పుడు చూసినా జోకులు వేస్తూనే ఉంటారు. ఆయనతో సీరియస్ సీన్స్ చేయడం చాలా కష్టం. ఆయనతో ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేయాలని అనుకుంటున్నాను. ఈ సిరీస్ లో చేసే ఛాన్స్ ఇచ్చినందుకు నిహారిక గారికి మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాను" అని అన్నాడు.