Begin typing your search above and press return to search.
#నిశ్చయ్.. చిరునవ్వులతో కొత్త జంట కొత్త కొత్తగా...!
By: Tupaki Desk | 11 Dec 2020 1:30 PM GMTపెళ్లి తర్వాత కొత్త జంటకు వారం పాటు రకరకాల షెడ్యూల్స్ ఉంటాయి. ప్రస్తుతం నిహారిక- చైతన్య జంట హైదరాబాద్ రిసెప్షన్ లో సందడి చేయాల్సి ఉంటుంది. ఇక మెగా ఇంట పెళ్లికూతురు పెళ్లి కొడుకు అటూ ఇటూ గడప దాటాల్సి ఉంటుంది. మెగా- అల్లు కాంపౌండ్లలోనూ అడుగు పెట్టేస్తారు. చుట్టాలందరినీ పలకరించేస్తారు.
అదంతా ఒకెత్తు అనుకుంటే మరోవైపు ఫోటోషూట్లకు అలుపెరగకుండా ఫోజులివ్వాలి. ఈ విషయంలో నిహారికతో పోలిస్తే పెళ్లికొడుకు చైతన్య కాస్తంత స్లో అనే చెప్పాలి. కథానాయికగా ఎంతో పేషెన్స్ తో ఫోటోషూట్లు నిహారికకు కొత్తేమీ కాదు కానీ.. ఐజీ కుమారుడికి మాత్రం అవన్నీ కొత్తనే. అయినా ఈ పెళ్లిలో అతడు నిహారిక తో కలిసి ఎంతో ఎనర్జిటిక్ గా ఫోటోషూట్లలో కనిపించాడు.
నిహారిక కొణిదెల- చైతన్య జొన్నలగడ్డ వివాహం తర్వాత ఒక ఫోటోషూట్ కోసం పోజులివ్వగా.. ఆ షూట్ నుంచి ఓ చక్కని చిత్రాన్ని షేర్ చేశారు. చైతన్య వైట్ షర్ట్ పై నల్ల జాకెట్ లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటే నిహారికా ఎరుపు రంగు డిజైనర్ శారీలో కనిపించింది. కొత్త జంట చిరునవ్వులు చిందిస్తూ ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తోంది.