Begin typing your search above and press return to search.
నిహారిక నుదిటిపై హబ్బీ తొలి ముద్దు
By: Tupaki Desk | 12 Dec 2020 3:46 AM GMTనిశ్చయ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇటీవల గూగుల్‌లో ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్ లోని ఉదయ్ విలాస్ లో అంగరంగ వైభవంగా నిహారిక- జొన్నలగడ్డ చైతన్యల వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ హీరోలంతా పాల్గొనడంతో ఈ పెళ్లికే కొత్త కళ వచ్చింది. చాలా రోజుల తరువాత మెగా హీరోలు.. అల్లు ఫ్యామిలీ హీరోలు అంతా ఒకే వేదికని పంచుకోవడం వీక్షకులని కనువిందు చేసింది.
నిహారిక - చైతన్య వివాహం పూర్తయి అందరూ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. అయినా ఉదయ్ పూర్ లో జరిగిన నిహారిక - చైతన్యల రెండ్రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్ జ్ఞాపకాలు ఇప్పటికీ వారిని వెంటాడుతూనే వున్నాయి. మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నాయట. నూతన వధూవరులు నిహారిక- చైతన్యలు ఫొటోలకు పోజిలిస్తూ కిస్ చేసుకున్న జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారట.
పెళ్లి తరువాత చైతన్య ..నిహారిక నుదుటిపై తొలి ముద్దు పెట్టారు. ఈ ఫొటో తాజాగా అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతోంది. సంగీత్ ఈవెంట్ లో భాగంగా జరిగిన ఫోటోషూట్ సందర్భంగా చైతన్య.. నిహారిక నుదిటిపై ముద్దు పెట్టుకోవడం ..ఈ క్షణాల్ని వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధించాడు. బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ లో వున్న ఈ ఫొటో ఎంత కళాత్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫొటోని కొత్త జంట ఆల్బమ్ లో ఎంతో ప్రత్యేకమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు.