Begin typing your search above and press return to search.

నీహారిక వెడ్డింగ్ ఏమైందబ్బా!?

By:  Tupaki Desk   |   25 April 2018 7:31 AM GMT
నీహారిక వెడ్డింగ్ ఏమైందబ్బా!?
X
నీహారిక వెడ్డింగ్ అనగానే.. ఇదేదో ఆమె పెళ్లి కబుర్లకు సంబంధించిన వ్యవహారం అంతే. ఇప్పుడప్పుడే పెళ్లి పీటలు ఎక్కే ఉద్దేశ్యం.. మెగా డాటర్ కు ఏ మాత్రం లేదు. హీరోయిన్ గా సత్తా చాటే వరకూ పెళ్లీ గిళ్లీ జాన్తా నై అని ఇప్పటికే చెప్పేసిందట. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే.. ఈమె నటించిన తొలి సినిమా ఒక మనసు.. జనాలను ఆకట్టుకోలేకపోయింది.

సినిమా బాగానే ఉందనే టాక్ వచ్చినా.. నెరేషన్ మరీ బీసీల కాలం నాటిదిలా ఉండడంతో ఆడియన్స్ కు అస్సలు ఎక్కలేదు. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ ఈ భామ చేసిన మూవీ హ్యాపీ వెడ్డింగ్. ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయిపోయి చాలా కాలమే అయింది కానీ.. విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. జనవరి నుంచి ఈ సినిమా రిలీజ్ కోసం మంచి డేట్ కావాలని చూస్తున్నారట. తెలుగులో నీహారిక హీరోయిన్ గా నటించిన రెండో సినిమా కావడంతో ఆసక్తి బాగానే ఉన్నా.. పెద్ద సినిమాల మధ్యలో వస్తే అనవసరంగా మరీ రిస్క్ అవుతుందని యూనిట్ భయపడుతున్నారట.

పెద్ద సినిమాల హడావిడి తగ్గిన తర్వాత రిలీజ్ చేద్దామని నిర్మాతలు అంటున్నారట. అయితే.. మరోవైపు ఈ సినిమాలో హీరోగా సుమంత్ అశ్విన్ నటించిన సంగతి తెలిసిందే. రిలీజ్ విషయంలో ఓ ప్లానింగ్ కు వచ్చిన ఎంఎస్ రాజు మాత్రం.. మంచి టైం చూసి రిలీజ్ చేసేద్దాం అని పట్టుబడుతున్నారట. మరికొన్ని రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.