Begin typing your search above and press return to search.

హ్యాపీగా నీహారిక వెడ్డింగ్ పూర్తి

By:  Tupaki Desk   |   11 Jan 2018 4:32 AM GMT
హ్యాపీగా నీహారిక వెడ్డింగ్ పూర్తి
X
మెగా ఫ్యామిలీలో హీరోలు చాలామందే ఉన్నా హీరోయిన్ అయి కెమెరా ముందుకొచ్చింది నీహారిక మాత్రమే. నటుడు నాగబాబు కుమార్తె అయిన నిహారిక తన ఫస్ట్ సినిమా యంగ్ హీరో నాగశౌర్య పక్కన చేసింది. ఒక మనసు పేరిట వచ్చిన ఈ మూవీ మరీ క్లాసీగా ఉండటంతో పాటు విషాదాంతం కావడంతో అది బాక్సాఫీసును ఆకట్టుకోలేక పోయింది. ఇందులో నీహారిక నటనకు ప్రశంసలు వచ్చాయే తప్ప తరవాత సినిమాలకు ఆఫర్లు పెద్దగా రాలేదు.

మొదటి సినిమా చేదు అనుభవం నుంచి బయటపడిన నీహారిక ఇప్పుడు కొత్తగా ఓ సినిమా చేస్తోంది. ఈసారి ఆమె యంగ్ హీరో సుమంత్ అశ్విన్ తో జత కట్టింది. హ్యాపీ వెడ్డింగ్ పేరుతో వస్తున్న ఈ సినిమాలో కాస్త గ్లామర్ రోల్ చేసినట్టే కనిపిస్తోంది. దీనికితోడు టాలీవుడ్ కు బాగా కలిసొచ్చిన పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోంది. ఇందులో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు బోలెడుమంది పెళ్లి పెద్దలుగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కర్య ఈ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం సాహో లాంటి భారీ సినిమా తీస్తున్న యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశానని.. మంచి టీంతో పనిచేయడం ఆనందంగా ఉందని నీహారిక తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో తన హ్యాపీనెస్ ను షేర్ చేసింది.

నీహారిక ఫస్ట్ ఫిలిం ఒక మనసులో మొత్తం ట్రెడిషనల్ గానే కనిపించింది. ఒక్క సీన్ లో కూడా మోడ్రన్ డ్రస్సులో కనిపించదు. ఆసాంతం అదే గెటప్ లో కొనసాగడంతో ఆమెలోని గ్లామర్ కంటెంట్ ఏ కొంచెం వెలుగులోకి రాలేదు. హ్యాపీ వెడ్డింగ్ సినిమా తన లుక్ ను.. లక్ ను మారుస్తుందని నీహారిక ఆశపడుతోంది.