Begin typing your search above and press return to search.
అందరికీ దూరంగా నిహారిక.. దేనికీ దూరం?
By: Tupaki Desk | 23 Nov 2021 9:30 AM GMTమెగా ప్రిన్సెస్ నిహారిక టెకీ చైతన్యను పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైన సంగతి తెలిసిందే. నాటి నుంచి పుట్టినిల్లు వదిలి మెట్టినింట్లోనే కాపురానికి వెళ్లారు. అమ్మగారింట్లో సాగినట్లు.. అత్తగారింట్లో సాగదుగా. అన్ని పనులు చేయాలి. ఇంటి బాధ్యత తీసుకోవాలి. ఇలా చాలా విషయాల్లో కీలక వ్యక్తిగా ఆ ఇంటి కోడలు మెలగాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలన్ని నిహారికపై ఉన్నాయి. అయితే నిహారిక వాటన్నింటిని నిర్వర్తిస్తూనే వేరు కాపురం పెట్టినట్లు తనే స్వయంగా రివీల్ చేసారు.
``నేను ఇప్పుడు నాన్న ఇంట్లో ఉండలేదు. అత్తారింట్లోనూ ఉండలేదు. నేను .. నాభర్త విడిగా ఉంటున్నాం. దగ్గరవాళ్లు అంటూ ఎవరూ లేరిప్పుడు. కొన్నిరోజుల పాటు ఇలా ఉండాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది నాకు చాలా కొత్తగా ఉంది. ఇప్పటివరకూ ఇంట్లో ఎప్పుడు సింగిల్ గా లేను. ఇప్పుడు ఉండాల్సి వస్తోంది. నన్ను ఇల్లు దాటి ఎక్కడికి పంపిచేవారు కాదు. అనుమతి కేవలం 3 రోజులు మాత్రమే. అందుకే ఇప్పుడైనా కనీసం ఫ్రీగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను`` అని తెలిపారు.
ఇక నిహారిక కెరీర్ విషయానికి వస్తే.. సినిమాలపై అంతగా దృష్టి పెట్టలేదు. ఓటీటీ రంగంలో రాణించాలని భావిస్తోంది. నటిగా..నిర్మాతగా భవిష్యత్ లో ఈ రంగంలో సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. ప్రస్తుత నిర్మాతగా ఓ ఫ్యామిలీ స్టోరీని వెబ్ సిరీస్ గా నిర్మిస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ కి రానుంది. అలాగే నటిగా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది.
సినిమాల్లో కొనసాగరా? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి సినిమాలు తప్పకుండా చేస్తాను. ``కాజల్ అగర్వాల్.. సమంత లా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నా. భర్త అంగీకారంతోనే నటన కొనసాగుతుంది. ఆయనని కాదని ఏపని చేయను`` అని తెలిపింది. అలాగే తన సోదరుడు వరుణ్- భర్త చైతన్య గురించి ఓ ఆసక్తికర విషయం కూడా రివీల్ చేసారు. వరుణ్ అన్న- చైతన్య చిన్పప్పటి నుంచే క్లాస్ మేట్స్ అని నిహారిక తెలిపారు.