Begin typing your search above and press return to search.
#నిహారిక.. పెదనాన్నతో సెల్ఫీ ఆల్బమ్ కే హైలైట్
By: Tupaki Desk | 7 Dec 2020 10:46 AM GMTబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక అంటే పెదనాన్న చిరంజీవికి ఎంతటి అభిమానమో తెలిసిందే. ఆయన ఏనాడూ పుత్రికావాత్సల్యాన్ని దాచుకోలేదు. నిహారిక ఎదుగుదలను ఆనందాన్ని ఆకాంక్షించారు చిరు. అంతకుమించి నిహారికకు పెదనాన్న అంటే అభిమానం... గౌరవం. తాను మాట్లాడే ఏ సందర్భంలోనూ పెదనాన్న గురించి ప్రస్థావన వస్తే ప్రేమాభిమానాన్ని నిహారిక ఏనాడూ దాచుకోలేదు.
పెదనాన్న సినిమాలో ఒక చిన్న అవకాశం వచ్చినా చాలు..!! అంటూ సైరా-నరసింహారెడ్డిలో తళుక్కున మెరిసే గిరిజన బిజిలీ పాత్రలో కనిపించింది. ఒక యుద్ధ సన్నివేశంలో ఇలా వచ్చి అలా మటుమాయమయ్యే పాత్ర అది. అయినా నిహరిక అభిమానులు చిల్ అయ్యారు.
అదంతా సరే కానీ కుందనపు బొమ్మ నిహారిక పెళ్లికూతురైంది. ఈ పెళ్లిలో పెదనాన్న సందడి అంతా ఇంతా కాదు. నిన్న నాగబాబు ఇంట పెళ్లికూతురిని చేసిన వేడుకలోనూ పెదనాన్న పెద్దమ్మ తన చెంతనే ఉన్నారు. అప్పుడు ఎక్స్ క్లూజివ్ గా ఇదిగో ఇలా మెగాస్టార్ తో నిహారిక ఓ సెల్ఫీ దిగింది. బహుశా తన పెళ్లి ఆల్బమ్ కే హైలైట్ ఫోటో ఇది. ఎక్స్ క్లూజివ్ గా ఎప్పటికీ దాచుకునే అరుదైన ఫోటో ఇదే అవుతుందేమో! ఈనెల 9న నిహారిక వివాహం ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో జరగనుంది. ఈ వేడుకకోసం ఇప్పటికే ఇరుకుటుంబాలు అక్కడికి చేరుకోగా బంధు మిత్రులు ప్రయాణాల్లో ఉన్నారు.