Begin typing your search above and press return to search.

నాగ‌బాబు కూతురా.. మ‌జాకా!

By:  Tupaki Desk   |   11 March 2016 4:02 AM GMT
నాగ‌బాబు కూతురా.. మ‌జాకా!
X
సెల‌బ్రిటీలు అభిమానుల అభిప్రాయాల్ని తెలుసుకొనేందుకే సోష‌ల్ నెట్‌ వ‌ర్కింగ్ సైట్ల‌లోకి అడుగుపెడుతుంటారు. మంచి చెడులు తెలుసుకొని వాటిని సరిదిద్దుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే... వ‌న్స్ అక్క‌డికొచ్చాక వాళ్ల‌కి ఎలాంటి అనుభ‌వాలైనా ఎదురు కావొచ్చు. అక్క‌డ మంచి ఉంటుంది, చెడూ ఎదుర‌వుతుంటుంది. వాటిని రిసీవ్ చేసుకోవ‌డంలోనే ఉంటుంది విష‌య‌మంతా. అప్పుడ‌ప్పుడు మ‌న‌సుకు క‌ష్ట‌పెట్టే ప్ర‌శ్న‌లు కూడా ఎదుర‌వుతుంటాయి. వాటిని డీల్ చేసే విధానం తెలిసుండాలి. మెగా డాట‌ర్ నిహారికకి కూడా అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది.

ఇటీవ‌లే ఆమె ఫేస్‌ బుక్ ద్వారా అభిమానుల‌తో వెబ్ కామ్ ఛాటింగ్ చేసింది. అక్క‌డ ఆమెకి ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లెదుర‌య్యాయి. ఒక‌డైతే ఫ్ల‌యింగ్ కిస్సిచ్చేయ‌మ‌ని అడిగాడు. అలా అడ‌గ్గానే కిస్సిచ్చేస్తే నిహారిక మెగా డాట‌ర్ ఎందుక‌వుతుంది? అస‌లే మెగా ఫ్యామిలీకి ఓ ఇమేజ్ ఉంది. అలా అడిగాడ‌ని ఆమె స్పందిస్తే మ‌రొక‌రు అలాంటి మ‌రో కొంటె ప్ర‌శ్న ఎదుర‌య్యే ప్ర‌మాదముంది. అందుకే నిహారిక ``ఫ్ల‌య్యింగ్ కిస్సు ఎందుకులెండి? మీరు గాలికి లేచిపోతారు`` అని కాసింత ఘాటుగా రిప్లై ఇచ్చేసింది. అది చివ‌ర ఇక‌, ఆమెకి మ‌ళ్లీ అలాంటి కొచ్చెన్లు రాలేదు. అందుకే మ‌రీ... మెగా కూతురా మ‌జాకా అనేది! మ‌రో అభిమాని మీ బావ అల్లు అర్జున్‌ తో ఎప్పుడు న‌టిస్తారు? అని అడిగాడు. ``అల్లు అర్జున్ న‌టిస్తాన‌ని నేను మీకు చెప్పానా? ఏమో నాకు ఆ విష‌యం తెలియ‌దు. అల్లు అర్జున్ నాకు వ‌ర‌స‌కి బావే కానీ... ఆయ‌న్ని నేను అన్న‌య్యా అని పిలుస్తుంటా`` అని చెప్పుకొచ్చింది నిహారికా. త్వర‌లోనే ఆమె ఒక మ‌న‌సు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.