Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ అంటే మీకేమొస్తుంది?: నిహారిక

By:  Tupaki Desk   |   20 March 2019 10:10 PM IST
పవర్ స్టార్ అంటే మీకేమొస్తుంది?: నిహారిక
X
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఒక సెక్షన్ కు చాలా ఉత్సాహం ఉంటుంది. వారి ఉత్సాహానికి అసలు హద్దులే ఉండవు. ముఖ్యంగా సినిమా ఈవెంట్ లు జరిగినప్పుడు కనుక వారున్నారంటే సందడే సందడి. పవర్ స్టార్ పవర్ స్టార్ నినాదాలతో ఆ వెన్యూ మార్మోగిపోతుంది. ఇక ఆ కార్యక్రమానికి హాజరైన సెలబ్రిటీలు పవన్ గురించి రెండు ముక్కలు మాట్లాడేవరకూ ఫ్యాన్స్ అసలు ఊరుకోరు. ఈ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఇబ్బంది పడిన సెలబ్రిటీలు ఉన్నారు.. వివాదాలలో ఇరుక్కున్న వారు కూడా ఉన్నారు. తాజాగా మెగా హీరోయిన్ నిహారికకు అలాంటి పరిస్థితే ఎదురైంది.

నిహారిక తాజా చిత్రం 'సూర్యకాంతం' త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం 'సూర్యకాంతం' టీమ్ తో పాటుగా నిహారిక కాలేజీలలో పర్యటిస్తోంది. అలా ఒక కాలేజికి వెళ్ళినప్పుడు అక్కడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ సంఖ్యలో ఉండడంతో 'పవన్ పవన్' అనే స్లొగన్స్ మిన్నంటాయి. దీంతో వారిని బుజ్జగిస్తూనే "నాకు చాలా రోజుల నుండి ఒక డౌట్ ఉంది. అడగనా?" అంటూ ప్రశించింది. అందరూ "సరే.. సరే" అని బదులిచ్చారు. అప్పుడు నిహారిక "మీరు అలా అరుస్తూ ఉంటే నేను ఏమనాలి?" అని అడిగింది. దానికి ఆ క్రౌడ్ "పవర్ స్టార్ అనాలి" అని సమాధానం ఇచ్చారు. తన ప్రశ్నను కంటిన్యూ చేస్తూ నిహారిక "పవర్ స్టార్ అంటే మీకేమొస్తుంది?" అని అడిగింది. వాళ్ళు "ఎనర్జీ వస్తుంది" అన్నారు. దీంతో నిహారిక "పవర్ స్టార్" అని చెప్పింది.

ఇక్కడ ఉత్సాహంగా పవర్ స్టార్ అని అరిచేవాళ్ళు జనసేనకు ఓటు వెయ్యాలని.. అలా చేస్తే పవన్ సీమ్ అవుతారని వాళ్ళకు సలహా ఇచ్చింది. పవన్ మ్యానరిజం చూపించమని అడిగితే 'బద్రి' స్టైల్ లో మెడదగ్గరకు చెయ్యి పోనిచ్చి బాబాయ్ ని గుర్తు చేసింది. పవన్ డైలాగ్ ఒకటి చెప్పాలని వాళ్ళు కోరితే.. 'ఖుషి' సినిమా నుండి ఒక డైలాగ్ చెప్పి వారిని సంతోషపెట్టింది. ఓవరాల్ గా పవన్ ఫ్యాన్స్ ను చక్కగానే హ్యాండిల్ చేసింది నిహారిక.