Begin typing your search above and press return to search.
ఈ రోజు రాత్రి మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం...?
By: Tupaki Desk | 13 Aug 2020 1:00 PM GMTమెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. తనకు పెళ్లి కుదిరిందని నిహారిక సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ అన్నట్లు ఒక్కొక్కటిగా రిలీవ్ చేయడంతో అందరి దృష్టి ఆమె పెళ్లి పై పడింది. నిహారిక తనకు కాబాయే వరుడి ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేసి అందరికి పరిచయం చేసింది. గుంటూరు ఐజీ కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యని నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక పెళ్లిచేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉండటం.. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్యకు స్నేహితులు అవడంతో ఈ సంబంధం సెట్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో నిహారిక - చైతన్య నిశ్చితార్థ వేడుక మరి కాసేపట్లో జరగబోతుందని సమాచారం.
కాగా, నిహారిక - చైతన్యల ఎంగేజ్మెంట్ ఈరోజు రాత్రి 8 గంటలకు హైదరబాద్ లోనే జగరగనుంది. కోవిడ్ నిబంధనల ప్రకారం అతి కొద్ది మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం పంపించారని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ ఈ నిశ్చితార్థ వేడుకకి హాజరవుతారని సమాచారం. ఇటీవలే నాగబాబు నిహారిక ఎంగేజ్మెంట్ వార్తలపై స్పందిస్తూ.. 'మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నాం.. పెళ్లిని ఇలాంటి పరిస్థితుల్లో అట్టహాసంగా చేయడం కుదరదని' చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు ఎంగేజ్మెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిహారిక నిశ్చితార్థ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.