Begin typing your search above and press return to search.
నిహారిక ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించిన మెగా ఫ్యామిలీ!!
By: Tupaki Desk | 29 July 2020 1:00 PM GMTమెగా డాటర్ నిహారిక కొణిదెల.. ఈ మధ్య సినిమాలలో కనిపించడం తగ్గించింది. ఇంతకాలం సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను తన సత్తా చాటింది. ఫస్ట్ సినిమా 'ఒక మనసు' పరవాలేదనిపంచినా ఆ తర్వాత వచ్చిన 'హ్యాపీ వెడ్డింగ్',‘సూర్యకాంతం’ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ నిహారిక నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మాత్రం మంచి ఆదరణ పొందింది. ఇక చివరిగా మెగాస్టార్ చిరంజీవి 'సైరా' సినిమాలో గిరిజన యువతి పాత్రలో మెరిసింది. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో సినీ వర్గాల దృష్టి కూడా ఎక్కువగా నిహారిక పై ఉంది. ప్రేక్షకులు కూడా నిహారిక నటించే సినిమాల పై అంచనాలు పెట్టుకుంటున్నారు. అయితే నిహారిక నటించిన సినిమాలు మాత్రం అభిమానుల అంచనాలు చేరలేక పోతున్నాయి. ఇదిలా ఉండగా.. నిహారిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే.
గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక నిశ్చితార్థం ఆగష్టు 13న జరగనుంది. నిహారికకు కాబోయే భర్త చైతన్య తల్లి జె.పద్మ తండ్రి గుణ వెంకటరత్నం.. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు అప్పట్లో మంచి స్నేహితులట. వీరిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం వలన పద్మ పెళ్ళైన నాటి నుంచే చిరంజీవికి, చైతన్య ఫాదర్ ప్రభాకర్ రావు మధ్య మంచి స్నేహం కుదిరింది. ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ కుటుంబ బాగోగులు మాట్లాడుకుంటూ ఉండేవారట. ఇక కొద్దిరోజుల క్రితం ప్రభాకర్ రావు మాటలో మాటగా తన కొడుకుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నానని చిరుతో అనగానే.. నిహారికని ఇచ్చి చేస్తే అన్నివిధాలా బాగుంటుందని అనుకున్నారట చిరంజీవి. ఆ వెంటనే ఈ పెళ్లి ప్రపోజల్ ని ప్రభాకర్ రావుకు తెలుపగానే సంతోషించి వెంటనే ఈ పెళ్లికి ఓకే అనుకున్నారు. హైదరాబాద్ లోనే పుట్టిపెరిగిన చైతన్య ఎంబీఏ పూర్తిచేసి జాబ్ చేస్తున్నాడట. ఇక ఈ ఏడాది చివరిలోగా పెళ్లి చేసేస్తామని ఇదివరకే నాగబాబు తెలిపారు.