Begin typing your search above and press return to search.
ఆగస్టులోనే మెగా ఫ్యామిలీ వేడుక
By: Tupaki Desk | 27 July 2020 1:00 PM GMTమెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం ఐపీఎస్ ఆఫీసర్ తనయుడు జీవీ చైతన్యతో ఫిక్స్ అయిన విషయం తెల్సిందే. ఇటీవలే ఈ వివాహంకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. నిహారిక తనకు కాబోయే వాడిని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. ఇక వీరి వివాహ నిశ్చితార్థం ఆగస్టులో జరుగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. పెళ్లి వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరపాలనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. పెళ్లి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కాని ఆగస్టులో నిహారిక చైతన్యల నిశ్చితార్థం జరుగబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది.
వరుణ్ తేజ్ తాజాగా ఒక సందర్బంలో ఆగస్టులో ఇంట్లో ఒక వేడుక ఉంది అన్నాడు. అంటే ఆ వేడుక నిహారిక నిశ్చితార్థం అయ్యి ఉంటుందని అంతా కన్ఫర్మ్ గా భావిస్తున్నారు. ప్రస్తుతం నిశ్చితార్థంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే షాపింగ్ అయ్యిందని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. చైతన్య మరియు నిహారికల వివాహ నిశ్చితార్థంకు మెగా హీరోలు అంతా ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశం ఉంది. కనుక ఫ్యాన్స్ నిహారిక నిశ్చితార్థ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం పవన్ దీక్షలో ఉన్నాడు. ఆగస్టుకు ఆయన దీక్ష పూర్తి అవ్వబోతుంది. ఆయన దీక్ష పూర్తి అయిన తర్వాత డేట్ ను ఫిక్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఒక వేళ నిశ్చితార్థ సమయంకు పవన్ దీక్షలో ఉన్నా కూడా కూతురు వేడుకలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. ఇటీవల నితిన్ పెళ్లి కొడుకును చేసే కార్యక్రమంలో పవన్ దీక్షలో ఉండే పాల్గొన్నాడు. నిహారిక ఎంగేజ్ మెంట్ చాలా స్పెషల్ గా ఉండే అవకాశం ఉందని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.