Begin typing your search above and press return to search.

'పవన్ కళ్యాణ్ నన్ను ఆటపట్టించేవారు'

By:  Tupaki Desk   |   23 April 2020 5:30 PM GMT
పవన్ కళ్యాణ్ నన్ను ఆటపట్టించేవారు
X
నిహారిక కొణిదెల.. ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను తన సత్తా చాటుతోంది. మొదటి సినిమా ఒక మనసు' పరవాలేదనిపంచినా ఆ తర్వాత వచ్చిన 'హ్యాపీ వెడ్డింగ్',‘సూర్యకాంతం’ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొందింది. నిహారిక తాజాగా చిరంజీవి 'సైరా' సినిమాలో బోయ పిల్ల పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో సినీ వర్గాల దృష్టి కూడా ఎక్కువగా నిహారిక పై ఉంది. ప్రేక్షకులు కూడా నిహారిక సినిమాలపై అంచనాలు పెట్టుకుంటున్నారు. కానీ ఆమె నటించిన సినిమాలు మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేక పోతున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ.. బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించింది. "పవన్ బాబాయ్ ఎక్కువగా మాట్లాడడు. ఆయన మితభాషి. ఎప్పుడు చూసినా కామ్ గా కనిపించే ఆయన, ఏదైనా ఫంక్షన్ కి వస్తే మాత్రం బాగానే సందడి చేస్తాడు. మేము ఏదైనా పిచ్చి పనులు చేస్తే ఆటపట్టించి ఏడిపిస్తాడు. అలాంటి ఆయన జనంలో వేదికలపై నుంచి చేసే ప్రసంగాలు వింటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ప్రసంగాలు నాకు స్ఫూర్తినిస్తాయి కానీ ఈ విషయం ఇంతవరకూ బాబాయ్ కి చెప్పలేదు. నాకు తెలిసి రాజకీయాల్లో అంతటి స్వచ్ఛమైన వ్యక్తి మరొకరు వుండరు. ఆయనకి అసలు స్వార్థమంటే ఏమిటో తెలియదు' అంటూ బాబాయ్ గురించి చెప్పుకొచ్చింది మెగా బ్యూటీ.