Begin typing your search above and press return to search.

వీడియో : మహేష్ తో మళ్లీ నిహారిక ఫన్‌

By:  Tupaki Desk   |   30 May 2022 4:29 AM GMT
వీడియో : మహేష్ తో మళ్లీ నిహారిక ఫన్‌
X
సోషల్‌ మీడియా ఫాలోవర్స్ కు ముఖ్యంగా ఎంటర్‌ టైన్మెంట్‌ స్టఫ్ ఫాలో అయ్యే వారికి నిహారిక ఎన్‌ ఎమ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్‌ మీడియాలో జస్ట్‌ చిల్‌ అంటూ అల్లరి అల్లరి వీడియోలు చేస్తూ ఫోటో షూట్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉండే నిహారిక ఇటీవల సర్కారు వారి పాట సినిమా విడుదల సమయంలో మహేష్ బాబుతో ఒక సరదా వీడియోను చేసి అందరి దృషిని ఆకర్షించిన విషయం తెల్సిందే.

సర్కారు వారి పాట సినిమా విడుదలకు ముందు ఆ వీడియో వైరల్‌ అయ్యింది. ఎవరు ఈ నిహారిక ఎన్‌ ఎమ్‌ అంటూ చాలా మంది సోషల్‌ మీడియాలో సెర్చ్‌ చేశారు. ఇప్పుడు మరోసారి మహేష్‌ బాబుతో వీడియోను షేర్‌ చేసింది. మహేష్ బాబు నిర్మాణంలో రూపొందిన మేజర్‌ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మళ్లీ నిహారిక ఎన్ ఎమ్‌ సందడి చేసింది. ఈ సారి మహేష్ బాబు మరియు అడవి శేష్ తో ఫన్ వీడియోను క్రియేట్ చేసి షేర్‌ చేసింది.

మహేష్ బాబు మేజర్ సినిమా టికెట్ల కోసం క్యూ లో నిల్చున్న వీడియోను ఆమె షేర్ చేసింది. అడవి శేష్‌ క్యూ లో నిల్చుంటే వెనక్కు పంపిన ఆమె మహేష్ బాబును చూడగానే అలా సిగ్గు పడుతూ మీరు ముందు ఉంటే పర్వాలేదు అన్నట్లుగా చెప్పడం.. వెనుక ఉన్న అడవి శేష్‌ సీరియస్ గా చూడటం అంతా ఫన్నీగా వీడియో ను డిజైన్‌ చేసిన నిహారిక మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

అడవి శేష్‌ హీరోగా మేజర్ సందీప్ జీవిత చరిత్ర ఆధారంగా మహేష్‌ బాబు మరియు సోనీ పిక్చర్స్ వారు కలిసి సంయుక్తంగా నిర్మించిన మల్టీ లాంగ్వేజ్ మూవీ 'మేజర్' ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. మహేష్ బాబు నిర్మాణంలో మొదటి సారి బయట హీరో తో సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.

మేజర్‌ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను ఆసక్తిని పెంచింది. సినిమా ప్రీమియర్ షో లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సందీప్ పోరాట సన్నివేశాలు కన్నీళ్లు తెప్పించే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. ఒక గొప్ప ఇండియన్ సినిమా గా మేజర్ నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.