Begin typing your search above and press return to search.

వరుడు దొరికాడని మెగా డాటర్ హింట్ ఇస్తోందా...?

By:  Tupaki Desk   |   17 Jun 2020 4:10 PM GMT
వరుడు దొరికాడని మెగా డాటర్ హింట్ ఇస్తోందా...?
X
మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో నిహారిక కొణిదెల ఒకరు. అయితే ఇప్పటి వరకు హీరోలే ఇంట్రడ్యూస్ అవగా ఫస్ట్ టైమ్ హీరోయిన్ పరిచయమైంది. ప్రస్తుతం నిహారిక ఇటు సినిమాలు చేస్తూనే అటూ డిజిటల్‌ వరల్డ్ లోను రాణిస్తోంది. నాగ సౌర్యతో చేసిన ఫస్ట్ సినిమా 'ఒక మనసు'తో పర్వాలేదు అనిపించుకుంది. ఇక తమిళ్ లో 'మక్కల్ సెల్వన్' విజయ్‌ సేతుపతి సరసన 'ఒరు నల్ల నాల్‌ పాతు సొల్రేన్‌' అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత వచ్చిన 'హ్యాపీ వెడ్డింగ్' 'సూర్యకాంతం' సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. కానీ డిజిటల్ రంగంలో అడుగుపెట్టి నిహారిక నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొందింది. ఇప్పటి వరకు ఆమె తమిళ్ లో ఒక సినిమా.. తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించింది. గతేడాది మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో నిహారిక గిరిజన యువతి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వడంతో సినీ వర్గాల దృష్టి కూడా ఎక్కువగా నిహారిక పై ఉంది. ప్రేక్షకులు కూడా నిహారిక సినిమాలపై మంచి అంచనాలతో వస్తున్నారు. దీంతో ఆచితూచి చిత్రాలు ఎంపిక చేసుకుంటోంది నిహారిక.

ఇదిలా ఉండగా ఇటీవల నిహారిక పెళ్లి వార్తలు ప్రసార మాధ్యమాల్లో ఊపందుకున్నాయి. ఆ మధ్య సాయి ధ‌ర‌మ్ తేజ్ - నిహారిక పెళ్లి చేసుకుంటున్నారనే వార్త‌లు వ‌చ్చాయి. కానీ అవి అబ‌ద్ధ‌మ‌ని వాళ్లే వెల్లడించారు. ఆ తర్వాత ప్రభాస్‌ ను నిహారిక పెళ్లాడబోతుందనే న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే ఇవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అయితే ఇటీవల నిహారిక తండ్రి నాగబాబు మెగా డాటర్ పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ''నిహారికకు ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేస్తామని.. మంచి అబ్బాయి దొరికితే కులం మతం పట్టింపు అస్సలు లేదని.. నిహారిక పెళ్లి తర్వాతే వరుణ్ తేజ్ పెళ్లి చేస్తానని'' చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు తాజాగా నిహారిక ఫేస్ బుక్ లో పోస్ట్ చూస్తే అమ్మడు పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయిందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. నిహారిక ప్రముఖ స్టార్ బక్స్ కాఫీ కప్ మీద 'Ms. Niha' అని రాసి ఉండగా 'Ms.'ని కొట్టేసి 'Mrs.' అని క్వశ్చన్ మార్క్ ( ? ) పెట్టింది. దీన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన నిహారిక ''ఉహ్.. వాట్ ?'' అని కామెంట్ పెట్టింది. దీంతో నిహారిక పెళ్లి సెట్ అయిందని హింట్ ఇస్తుందని సోషల్ మీడియా వేదికగా ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు. మిమ్మల్ని చేసుకోబోయే లక్కీ పర్సన్ ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. 2020లో అన్ని బ్యాడ్ న్యూస్ వింటున్నాం.. మీరొక్కరే గుడ్ న్యూస్ చెప్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఐతే నిహారిక పెట్టిన పోస్టుపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.