Begin typing your search above and press return to search.
ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే సావిత్రా?
By: Tupaki Desk | 19 May 2016 4:43 AM GMTసినిమా ఇండస్ట్రీలో ముఖస్తుతి ఎంత ఎక్కువో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరోల్ని బాబు అంటూ నెత్తిన పెట్టుకొని చూసుకోవటం మామూలే. లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకునే హీరోల్ని ఆ మాత్రం గౌరవించటం తప్పేం కాదని వాదించేవాళ్లు ఉంటారు. ఆ విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా కొణిదెల ఇంటి వారమ్మాయి నిహారిక హీరోయిన్ గా నటించిన తొలిచిత్రం ‘‘ఒక మనసు’’ ఆడియో ఫంక్షన్ తాజాగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఒక అంశం గురించి తప్పనిసరిగా ప్రస్తావించాల్సిందే.
ఇప్పటివరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న తీరుకు బిన్నంగా..ఒక పెద్దింటి సినిమా ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి హీరోయిన్ గా నటించటం ఒక పెద్ద విషయంగా చెప్పాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా నిహారికను ఎత్తేసిన వైనం చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావటం ఖాయం. ఎక్కడైనా ఒక సినిమా విడుదలైన తర్వాత.. బాగా చేస్తే.. అరే.. చాలా బాగా చేశారంటూ కాంప్లిమెంట్లు ఇవ్వటం సహజం. ఒకటికి నాలుగు సినిమాలు చేసి.. ప్రేక్షకుల మది మీద ఒక ముద్ర వేశాక.. అలనాటి మహామహులతో పోల్చటం బాగోకున్నా కాస్త ఇబ్బందిగా అయినా సర్దేసుకోవచ్చు.
కానీ.. అందుకు భిన్నంగా నిహారిక నటించిన తొలి చిత్రం విడుదల కాక ముందే.. ఆమెను సావిత్రి.. సౌందర్య.. అనుష్కలతో పోల్చేయటం చూస్తే కామెడీ కామెడీగా అనిపించక మానదు. ‘‘ఒక మనసు’’ చిత్రంలో నిహారిక బాగా నటించి ఉండొచ్చు. అయితే.. ఆ సినిమా విడుదలై.. ప్రేక్షకుల ప్రశంసలు పొందిన తర్వాత ఆమెను పొగిడేయటంలో ఒక అర్థం ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా బాక్సుల్లో ఉన్న బొమ్మ బయటకు కూడా రాకుండానే.. నిహారికను అలనాటి వెండితెర అద్భుతం సావిత్రితో.. ఆ మద్యన వెండి తెర మీద తళుక్కున మెరిసి ఆనంతలోకాలకు పయనమైన సౌందర్యలతో పోల్చటం మాత్రం ఎబ్బెట్టుగా ఉందని చెప్పక తప్పదు. పొగిడేసుకోవటం తప్పు కాదు.. కానీ మహామహులతో పొగిడేటప్పుడు కాస్త.. ప్రేక్షక దేవుళ్ల ఆమోదం కూడా తీసుకోవాలిగా? పెద్దింటి ఫ్యామిలీలకు చెందిన వారసులకు అలాంటి అవసరం లేదనుకుంటున్నారా ఏంటి..?