Begin typing your search above and press return to search.
మెగా డాటర్ 'ఎ లిటిల్ బర్డ్'
By: Tupaki Desk | 30 Oct 2018 10:35 AM GMT‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తాజాగా ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిహారిక నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈమె నటించిన సినిమాలు కమర్షియల్ గా మంచి పేరు తెచ్చుకోలేక పోయినా కూడా నిహారికకు మాత్రం మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఒక వైపు తెలుగులో నటిస్తూనే మరో వైపు తమిళంలో కూడా ఈమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం నిహారిక తన కొత్త సినిమా కోసం సిద్దం అవుతోంది.
సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియతో కలిసి నిహారిక ఒక చిత్రాన్ని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుజన్ అనే దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం కాబోతున్నాడు. కంచె చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారబోతున్నాడు. ఈ చిత్రం గురించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. త్వరలోనే కాస్టింగ్ ఎంపిక కూడా జరుపనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి ఇంగ్లీష్ టైటిల్ ‘ఎ లిటిల్ బర్డ్’ అని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించారట. ఈ చిత్రాన్ని ‘ఎ లిటిల్ బర్డ్’ అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారట. అందుకే ఈ చిత్రానికి అదే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. శ్రియ మరియు నిహారిక ఈ చిత్రంలో అక్క చెల్లిగా కనిపించబోతున్నారు. అక్క - చెల్లిల మద్య జరిగే మానసిక సంఘర్షణ మరియు ప్రస్తుత సమాజ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా కథ ఉంటుందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.