Begin typing your search above and press return to search.

గ్రాండ్ గా మెగా డాట‌ర్‌ నిహారిక నిశ్చితార్థం‌...!

By:  Tupaki Desk   |   13 Aug 2020 5:30 PM GMT
గ్రాండ్ గా మెగా డాట‌ర్‌ నిహారిక నిశ్చితార్థం‌...!
X
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. నిహారిక ఎంగేజ్మెంట్ ఈ రోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌ లోని ట్రైడెంట్ హోట‌ల్‌ లో గ్రాండ్‌ గా జ‌రిగింది. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్య‌తో నిహారిక నిశ్చితార్థం‌ ఇరు కుటుంబ పెద్ద‌ల స‌మ‌క్షంలో జ‌రిగింది. కోవిడ్ నిబంధనల ప్రకారం అతి కొద్దిమంది అతిథులకు మాత్ర‌మే ఆహ్వానం పంపించారని తెలుస్తోంది. నిశ్చితార్ధం వేడుక‌కు మెగా ఫ్యామిలీ మొత్తం హాజ‌ర‌య్యారు. చిరంజీవి, సురేఖ‌, రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న‌, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, సాయి ధ‌ర‌మ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, శ్రీజ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కాగా, మెగా డాటర్ నిహారిక తనకు పెళ్లి కుదిరిందని సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ అన్నట్లు ఒక్కొక్కటిగా రిలీవ్ చేయడంతో అందరి దృష్టి ఆమె పెళ్లి పై పడింది. ఈ నేపథ్యంలో చైతన్యని నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక పెళ్లిచేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉండటం.. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్యకు స్నేహితులు అవడంతో ఈ సంబంధం సెట్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇటీవలే నాగబాబు నిహారిక ఎంగేజ్మెంట్ వార్తలపై స్పందిస్తూ.. 'మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నాం.. పెళ్లిని ఇలాంటి పరిస్థితుల్లో అట్టహాసంగా చేయడం కుదరదని' చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు నిహారిక - చైతన్యల నిశ్చితార్థ వేడుక నిర్వహించారు.