Begin typing your search above and press return to search.

యాబ్స్ తో మెగా ప్రిన్సెస్ షాకింగ్ లుక్

By:  Tupaki Desk   |   26 Aug 2022 5:01 PM GMT
యాబ్స్ తో మెగా ప్రిన్సెస్ షాకింగ్ లుక్
X
అందం ఆరోగ్యం గురించి ఆర్టిస్టులు ప‌డే త‌ప‌న అంతా ఇంతా కాదు. గ్లామ‌ర్ రంగంలో ఇది ఎంతో కీల‌క‌మైన‌ది. అందుకే నిరంతరం తిండి క‌ట్టేసి ప్ర‌తిదీ బ్యాలెన్స్ చేస్తూ జిమ్ ల‌కు వెళుతూ చాలా శ్ర‌మిస్తుంటారు. యోగా జిమ్ కి వెళ్ల‌డాన్ని అస్స‌లు డుమ్మా కొట్ట‌రు. ఒక‌వేళ ఇలాంటివి మిస్ చేస్తే ప‌రిణామం ఎలా ఉంటుందో చూస్తున్న‌దే.

పెళ్లికి ముందు ఎంతో స్లిమ్ గా ఉండే మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల పెళ్లి త‌ర్వాత చాలా బొద్దుగా మారింది. ఓవైపు సినిమాల్లో న‌టించ‌క‌పోవ‌డంతో ఫ్యాట్ కంట్రోల్ లేకుండా పోయింద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి.

కానీ ఇంత‌లోనే నిహారిక అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఇప్పుడు జిమ్ కి వెళ్ల‌డ‌మే కాదు.. ఏకంగా 6 ప్యాక్ యాబ్స్ నే చూపిస్తూ షాకిచ్చింది.

ఇటీవల నిహారిక తన భర్తతో కలిసి రెగ్యుల‌ర్ గా జిమ్ కు వెళుతోంది. మరింత ఆకర్షణీయమైన శరీరాకృతితో క‌నిపిస్తోంది. ఈ రోజు నీహారిక‌-చైత‌న్య‌ జంట జిమ్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేయ‌గా నిహారిక‌ కొత్తగా రూపుదిద్దుకున్న‌ యాబ్స్ ని ప్రదర్శించింది. ఈ లుక్ ని ప‌రిశీలిస్తే బరువు తగ్గి క‌నిపించింది. స్లిమ్ అవ‌తార్ కి షిఫ్ట‌వుతోంది.

నిహారిక కొంత కాలంగా న‌ట‌న‌కు దూరంగా ఉండ‌డంతో త‌ను తిరిగి పున‌రాగ‌మ‌నం చేయాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్ర‌స్తుతానికి జీ5 సిరీస్ హ‌లో వ‌ర‌ల్డ్ కోసం ప‌ని చేస్తున్న నిహారిక తిరిగి న‌టిగా ఎంట్రీ ఇవ్వాల‌ని అంతా కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతానికి హ్యాపీగా సంసార జీవ‌నాన్ని కోరుకుంటున్న నీహారిక తిరిగి న‌ట‌న‌లోకి ప్ర‌వేశిస్తుందా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.