Begin typing your search above and press return to search.

బికినీ టాప్ లో మెగా డాట‌ర్ నెట్టింట దుమారం!

By:  Tupaki Desk   |   12 Oct 2022 1:30 PM GMT
బికినీ టాప్ లో మెగా డాట‌ర్ నెట్టింట దుమారం!
X
మెగా డాట‌ర్ నిహారిక చిలౌట్ మూవ్ మెంట్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చేతిలో స‌మ‌యం చిక్కాలేగానీ లైఫ్ ని ఆస్వాదించ‌డంలో ముందుంటుంది. గెట్ టూ గెద‌ర్ పార్టీలు..వీకెండ్ పార్టీలు అంటా ఏ పార్టీని మిస్ చేయ‌దు. విదేశాల‌కు వెకేష‌న్ల‌కు వెళ్ల‌డం అన్నా నిహారిక‌కు ఎంతో ఇష్టం. ఇటీవ‌లే హాబ్బీ చైత‌న్య‌తో క‌లిసి జోర్డాన్ వెకేషన్ ఆస్వాదించిన సంగ‌తి తెలిసిందే.

ఈ వెకేష‌న్ పేరుతో ఏ కంగా ఓ ట్రావెల్ షోనే నిర్వ‌హించారు. జోర్డాన్ టూర్ మొత్తాన్ని షూట్ చేసి ట్రావెల్ షోగా డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

తాజాగా వారం క్రితమే ఆమె భర్తతో క‌లిసి ఇండోనేషియాలోని బాలికి వెళ్లింది. అక్క‌డ నుంచి స్నేహితులతో ఒంటరిగా హాలిడేకి ప్ర‌యాణమైంది. నిహారిక ఈ ప్రీ-వింటర్ హాలిడేని ట‌ర్కీలోని స్నేహితుల గ్యాంత్ తో ఎంజాయ్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

తాజాగా నెట్టింట కొన్ని ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ఇందులో నిహారిక టూపీస్ బికినీలో క‌నిపిస్తుంది. ఆమె ప‌క్క‌నే మ‌రో అమ్మాయి అదే ర‌కం పీస్ లో క‌నిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో పెద్ద పెద్ద బండ‌రాళ్ల అందాల్లో ఇద్ద‌రు సెల్పీలు దిగారు. స‌రిగ్గా ఈలోకేష‌న్ టర్కీలోని అంటాల్యలోని క్రిస్టల్ క్లియర్ వాటర్స్‌లో కానో రాఫ్టింగ్‌లా తెలుస్తోంది.

నిహారిక‌తో పాటు మరికొందరు స్నేహితులతో మరియు అక్కడ ఆమెను కలుసుకున్న కొంతమంది విదేశీ అమ్మాయిలు కూడా ఉన్నారు. అక్కడ ఆమెకు పరిచయమైన రష్యన్ అమ్మాయిలలో ఒకరైన ఇలోనా సెల్ఫీని క్లిక్ చేయడమే కాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

నిహారిక టూపీస్ బికినీ అభిమానుల్లో హాట్ం టాపిక్ గా మారింది. నిహారిక న‌టిగా కొన్ని సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ తెర‌పై ఏ నాడు గ్లామ‌ర్ పాత్ర‌లు పోషించింది లేదు. తెర‌పై చాలా ప‌రిమితంగానే క‌నిపించింది. అలాగే ఇంతవ‌ర‌కూ ఇలాంటి దుస్తుల్లోనూ ఏనాడు బ‌య‌ట క‌నిపించింది కూడా లేదు. తొలిసారి బికినీ దుస్తుల్లో క‌నిపించ‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌రి ఈ పిక్ ఇంకెన్ని సంచ‌ల‌నాల‌కు దారి తీస్తుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.