Begin typing your search above and press return to search.

క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి మెగా ప్రిన్సెస్‌ ని కిడ్నాప్ చేసి!

By:  Tupaki Desk   |   10 Oct 2020 9:50 AM GMT
క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి మెగా ప్రిన్సెస్‌ ని కిడ్నాప్ చేసి!
X
అవును... క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి కిడ్నాప్ చేసి కార్ లో ర‌య్ మ‌ని వెళ్లారు. అయితే అలా ఎత్తుకెళ్లినందుకు కంగారు ప‌డాల్సిందేమీ లేదు. త‌న‌ను తీసుకెళ్లింది ఎవ‌రో కాదు త‌న స్నేహితురాళ్లే.. పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం అయ్యింది. తొంద‌ర్లోనే మూడు ముళ్ల బంధంతో లైఫ్ లో సెటిలైపోతున్నావు. అయినా.. ఇంకా పార్టీ ఇవ్వ‌వా? అంటూ నిహారిక‌ను ఆట ప‌ట్టిస్తూ గోవా బీచ్ కి తీసుకెళ్లార‌ట ఫ్రెండ్సంతా‌. మెగా డాట‌ర్ నిహారిక నుంచే ఈ లీకులందాయి మ‌రి.

ఇంకేం ఉంది... ఈ పార్టీ డ్రామాకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. గోవా బీచ్ కి వెళ్లే ముందే చిలౌట్ ఫోటోలు ఫ్యాన్స్ కి ట్రీటిస్తున్నాయి. కాబోయే భ‌ర్త చైత‌న్య తో క‌లిసి గోవా లో ఈ బీచ్ సెల‌బ్రేష‌న్ గ్రాండ్ గానే జ‌రుగుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇంత‌కుముందు చైత‌న్య బ‌ర్త్ డే పార్టీని నిహారిక ఓ రేంజులోనే ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇది అంత‌కుమించిన చిలౌట్ పార్టీ.

ఇక పెద్దింటి అబ్బాయితోనే నిహారిక‌కు నిఖా ఖాయం కావ‌డంతో మెగా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది. లాక్ డౌన్ లో జ‌రిగిన నిశ్చితార్థ వేడుక‌కు మెగా అల్లు ఫ్యామిలీతో పాటు చైత‌న్య ఫ్యామిలీ మాత్ర‌మే ఎటెండ‌య్యారు. అప్పుడు ఫ్రెండ్స్ ని ఆహ్వానించ‌డం కుద‌ర‌లేదు. మాయ‌దారి క‌రోనా వ‌ల్ల అలా అయ్యింది. అందుకే ఇప్పుడు అన్ లాక్ లో గోవా సెల‌బ్రేష‌న్స్ తో క‌సి తీర్చుకుంటున్నార‌ట‌. ప్రస్తుతం గోవాలో రచ్చకు సంబంధించిన ఫోటోలు ఇంకా రావాల్సి ఉంది. ఇంత‌కీ ఈ పార్టీ ఇస్తోంది ఎవ‌రు నిహారిక‌నే బ్యాచిల‌ర్ పార్టీ ఇస్తోందా లేక స్నేహితులే పెళ్లికూతురుకు ఇస్తున్న పార్టీనా ? అన్న‌ది తెలియాల్సి ఉంది.