Begin typing your search above and press return to search.
కోలీవుడ్ తెగ నచ్చేసిందట
By: Tupaki Desk | 24 Jan 2018 4:51 AM GMTమెగా ఫ్యామిలీలోని ఏకైక హీరోయిన్ నీహారిక టాలీవుడ్ లో ఒక మనసు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ సినిమా మరీ క్లాస్ గా ఉండటంతో బాక్సాఫీసును పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ నీహారికలో మంచి నటి ఉందనే విషయాన్ని ప్రూవ్ చేసింది. మొదటి సినిమా చేదు అనుభవం నుంచి బయటపడిన నీహారిక ఇప్పుడు తెలుగులో యంగ్ హీరో సుమంత్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తోంది.
మరోవైపు నీహారిక ఇదే టైంలో కోలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. అక్కడ యాంగ్రీ యంగ్ మెన్ టైపు పాత్రలు వేసే విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న ఒరు నాల్ల నాల్ పాతు సొల్రే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కెరీర్ లో తొలిసారి తమిళ సినిమా చేస్తుండటం.. అసలు తెలియని భాష కావడంతో కాస్తంత భయపడ్డా తనను సొంత మనిషిలా చూసుకున్నారంటూ తెగ ఆనందపడిపోతూ చెబుతోందీ మెగా బ్యూటీ. ‘‘నా మొదటి తమిళ సినిమా చాలా ఎంజాయ్ చేశాను. నేను కోలీవుడ్ కు కొత్త అనే విషయం తెలుసు కాబట్టి యూనిట్ లో అందరూ చాలా సపోర్టివ్ గా నిలిచారు. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ మొత్తం హ్యాపీగా కంప్లీట్ చేశాను’’ అంటోంది నీహారిక.
మరోవైపు నీహారిక తెలుగులో సుమంత్ అశ్విన్ తో చేస్తున్న హ్యాపీ వెడ్డింగ్ సినిమా కూడా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి చేసింది. ఫస్ట్ ఫిలిం ఒక మనసులో మొత్తం సాంప్రదాయికంగానే కనిపించింది. ప్రస్తుతం చేసిన రెండు సినిమాల్లోనూ కాస్తంత స్టయిల్ మార్చినట్టే కనిపిస్తోంది. వీటిలో నీహారికకు ఏది కమర్షియల్ బ్రేక్ ఇస్తుందో చూడాలి.