Begin typing your search above and press return to search.

మెగా నిహారిక.. ఈ రేంజ్ గ్లామర్ ఊహించలేదు

By:  Tupaki Desk   |   13 April 2023 6:00 PM
మెగా నిహారిక.. ఈ రేంజ్ గ్లామర్ ఊహించలేదు
X
కొణిదెల నాగబాబు కూతురిగా, చిరంజీవి, పవన్ కల్యాణ్ ల అల్లరి కూతురిగా.. మెగా డాటర్ గా మంచి పేరునే సంపాదించుకుంది. ముందుగా టీవీలో యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. ఒక మనసు చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఈమె ఆ తర్వాత పలు సినిమాల్లోనూ కనిపించింది.

తన అందం, అభినయంతో ఎంతో కొంత ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ తో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకుంది. కేవలం సినిమాల్లో నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. 2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా వరస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా గడుపుతోంది.

ఈ క్యూట్ బ్యూటీ ఎంత బిజీగా ఉన్నా తనకు సంబంధించిన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైప్ కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేధికగా అందరితో పంచుకుంటుంది. అయితే తాజాగా నిహారిక ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే ఔట్ పిట్ లో దర్శనం ఇస్తూ... కుర్రకారులో హీటు పుట్టిస్తోంది. డెనిమ్ వేర్ డ్రెస్ వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

చాలా హాట్ అంట్ స్ట్రెయిట్ లుక్ తో మరింత రచ్చ చేస్తోందీ ముద్దుగుమ్మ. ట్ర యాంగిల్ షేప్ లో ఉన్న వైట్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని.. మత్తెక్కించే కళ్లతోనే మాయ చేస్తోంది. ఈమె ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నాయి. నిహారిక ఈ ఫొటోలు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో లైకులు, వందల్లో కామెంట్లు వచ్చాయి.

చాలా అందంగా ఉన్నావు, అదిరిపోయావు, హేయ్ బ్యూటిఫుల్, అంత క్యూట్ అండ్ హాట్ గా ఎలా ఉన్నావంటూ పలువురు కామెంట్లు చేశారు. ఐ లవ్ నిహా బంగారం అంటూ ఓ నెటిజెన్ తన మనుసులోని భావాన్ని కామెంట్లు రూపంలో వెల్లడించారు. ఒక్కగానొక్క మెగా హీరోయిన్.. మామూలుగా లేదుగా అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు.