Begin typing your search above and press return to search.
రాస్కోండి నాకు పోయేదేం లేదు -నిహారిక
By: Tupaki Desk | 8 Feb 2018 12:38 PM GMT''రాసేవాళ్లు రాస్తున్నారు. చదివేవారూ చదువుతున్నారు. వాళ్లు అలా రాసుకుంటే నాకేం నష్టం లేదు. అన్నీ తెలిసే ఇక్కడికి వచ్చాను. రాస్కోండి'' అంటోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. అమ్మడు వెబ్ సిరీస్ చేసిన తరువాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తొలి సినిమా రిలీజయ్యేలోపే ఆ సినిమా హీరోతో ఎఫైర్ ఉందంటూ రూమర్లు వచ్చేశాయి. సదరు లవ్ ఎఫైర్ గురంచి ఎన్నిసార్లు ఖండించినా కూడా నిహారిక వాటి గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడక తప్పట్లేదు.
ప్రస్తుతం ఒక తమిళ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన నిహారిక.. ఆ సినిమా ప్రమోషన్ టైములో కూడా ఇదే గాసిప్ గురించి క్లారిటీ ఇవ్వాలంటూ పలు ప్రశ్నలు ఎదురయ్యాయ్. దీని గురించి ఆమె భలే సింపుల్ గా స్పందించింది. ''మీరు నాగ శౌర్యతో లింకప్ గురించి మాట్టాడుతున్నారు.. మా కజిన్ (సాయిధరమ్) తో కూడా లింక్ చేశారు నన్ను. మా ఇద్దరికీ పెళ్ళి అని కూడా చెప్పారు. ఇవన్నీ ఈ ఇండస్ర్టీలో కామన్. అన్నింటికీ నేను ప్రిపేర్ అయ్యే వచ్చాను'' అంటూ కూల్ గా సెలవిచ్చింది నిహారిక. అంతే కాదు.. వీటి వలన తనకు లాభమూ లేదు నష్టమూ లేదు అంటోంది.
''వాళ్ళు ఎన్ని రాస్కున్నా నాకు పోయేదేం లేదు. నా దగ్గరకు వచ్చే కథలు ఆఫర్లు ఆగిపోవట్లేదు.. నా దగ్గరకు రానివి ఎలాగో రావట్లేదు. కాబట్టి నాకు వాటి వలన ఇబ్బందేం లేదు'' అంటూ సెలవు తీసుకుంది. మొత్తానికి గాసిప్స్ ను స్టార్ కిడ్స్ పెద్దగా పట్టించుకోరు అనడానికి నిహారిక ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఈమెను చూస్తుంటే బాలీవుడ్ లో ఆలియా భట్ వంటి భామలు గుర్తొస్తున్నారు కదూ.