Begin typing your search above and press return to search.

తేజు-నీహారిక.. ఆ ఛాన్సే లేదట

By:  Tupaki Desk   |   8 May 2017 7:01 PM GMT
తేజు-నీహారిక.. ఆ ఛాన్సే లేదట
X
మెగా ఫ్యామిలీపై వచ్చే రూమర్లకు కొదువ ఉండదు. ఎన్నిటికి సమాధానాలు ఇచ్చినా.. ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి పుట్టుకొస్తూనే ఉంటుంది. చక్కగా కాపురాలు చేసుకుంటున్న వారికి కూడా విడాకులు ఇచ్చేస్తుంటారు రూమర్ రాయుళ్లు. ఇప్పుడు బాగా హంగామా చేస్తూన్న రూమర్ ఏంటంటే.. సాయి ధరం తేజ్ - నీహారికలకు పెళ్లి నిశ్చయం అయిపోయిందట.

రెండు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని తేజు- నీహారిక నిశ్చితార్ధానికి ముహూర్తం పెట్టేసుకుంటున్నారని అంటున్నారు. అయితే.. అసలు వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశమే లేదన్నది అసలు విషయం. వరసకు నీహారికకు సాయి ధరం తేజ్ బావ అవుతాడు. అయితే.. అంతా కలిసి పెరగడంతో సోదరి భావన తప్ప.. నీహారికను ఎప్పుడూ మరదలిగా చూడలేదంటారు సన్నిహితులు. తాజాగా వచ్చిన రూమర్స్ అందరి కంటే ఎక్కువగా తేజును హర్ట్ చేశాయని అంటున్నారు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రూమర్ పై చాలానే ఫీలయ్యారట.

మరోవైపు తేజు.. నీహారికలకు అసలు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం కూడా లేదు. కెరీర్ పైనే దృష్టి పెట్టగా.. సాయి ధరం తేజ్ తెలుగులో తెగ బిజీగా ఉండగా.. నీహారిక ఓ తమిళ్ మూవీలో నటిస్తోంది.