Begin typing your search above and press return to search.
మెగా ప్రిన్సెస్.. నిలబడుతుందా?
By: Tupaki Desk | 18 May 2016 11:27 AM GMT‘ఒక్క మనసు’ సాంగ్ టీజర్ చూసిన వాళ్లందరికీ చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా చూడబోతున్న ఫీలింగ్ కలిగించింది. అటు నాగశౌర్యతో పాటు ఇటు కొణిదెల నీహారిక కూడా ప్లెజెంట్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే పండింది. మెగా వారి అమ్మాయి కచ్చితంగా వెండితెర మీద తన టాలెంట్ చాటుకునేలాగే అనిపించింది. కాకపోతే ఒకటే సందేహం.. ఈ అమ్మాయి హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందా..? నాగశౌర్య అంటున్నట్లు.. మెగా ఫ్యామిలీ ఆశిస్తున్నట్లు స్టార్ స్టేటస్ సంపాదిస్తుందా..?
నీహారిక హీరోయిన్ కావడానికి చిరంజీవి సహా మెగా ఫ్యామిలీలో చాలామంది అభ్యంతర పెట్టారన్న సంగతి తెలిసిందే. గ్లామర్ ఫీల్డులోకి ఆమె రావడం ఎవరికీ ఇష్టం లేదు. ఐతే పద్ధతైన క్యారెక్టర్లే చేస్తానన్న హామీతో మొండి పట్టు పట్టి తన కోరిక నెరవేర్చుకుంది నీహారిక. ‘ఒక్క మనసు’ టీజర్ చూస్తే నీహారిక మున్ముందు కూడా తెర మీద ఎలా కనిపించబోతోందో ఒక ఐడియా వచ్చేస్తోంది. పద్ధతైన స్టీరియో టైప్ రోల్స్ మాత్రమే చేసేలా కనిపిస్తోందామె. ఐతే ఇలాంటి పాత్రలతో తెలుగులో నెట్టుకురావడం అంత ఈజీ కాదు.
మెగా ఫ్యామిలీ రెకమండేషన్లతో రెండు మూడు అవకాశాలు రావచ్చేమో కానీ.. ఆ తర్వాత సొంతంగా నెగ్గుకురావాలంటే కాస్త గ్లామర్ పాత్రలు కూడా చేయాలి. కానీ నీహారికకు ఆ అవకాశం లేదు మరి. కాబట్టి ‘ఒక్క మనసు’ తరహా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే నమ్ముకుంటే.. కోలీవుడ్ బాట పట్టాల్సిందే. ‘ఒక్క మనసు’ దర్శకుడు రామరాజు తీసిన తొలి సినిమా ‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’లో ఇలాగే పద్ధతిగా కనిపించిన శ్రీదివ్యను ఇక్కడి ప్రేక్షకులు ఆదరించకపోతే.. కోలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైపోయింది. మరి నీహారిక కూడా అలాగే చేస్తుందా?