Begin typing your search above and press return to search.

నీహారిక ఓపెన్ గా చెప్పేసింది

By:  Tupaki Desk   |   6 Oct 2016 4:29 AM GMT
నీహారిక ఓపెన్ గా చెప్పేసింది
X
మెగా డాటర్ కొణిదెల నీహారిక తెరంగేట్రం పూర్తయిపోయింది. ఒక మనసు అంటూ ఈ ఏడాది జూన్ లోనే నీహారిక ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ హీరో నాగశౌర్యకు జోడీగా రొమాంటిక్ ఫిలింను బాగానే పండించింది కానీ.. నెరేషన్ విషయంలో మరీ స్లోగా ఉండడంతో.. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు. అరంగేట్ర మూవీ అని చెప్పుకోవడానికి తప్ప.. వేరే ఏ స్వీట్ మెమరీని ఒకమనసు మిగల్చలేకపోయింది.

ఈ సినిమా ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి నీహారికకు కొంచెం టైం పట్టింది. బాగా సైలెంట్ అయిపోవడంతో.. ఇకపై సినిమాలు చేయదేమో అని అంతా అనుకున్నారు. అయితే.. రెండో సినిమాతో అయినా సక్సెస్ కొట్టాలనే ఉద్దేశ్యంతో తొందర పడ్డం లేదట నీహారిక. 'కెరీర్ ని స్పీడ్ గా పరుగులు పెట్టించేయాలని అనుకోవడం లేదు. నెమ్మదిగా వెళ్లడమే నాకు ఇష్టం. నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం. మంచి స్క్రిప్ట్ దొరికితే మాత్రం తప్పనిసరిగా వెంటనే చేసేస్తాను' అంటోంది నీహారిక.

చేతిలో ఉన్న ఆఫర్ల సంగతేమీ పైకి చెప్పడం లేదు కానీ.. ప్రస్తుతం ఈ మెగా డాటర్ దగ్గర 2-3 ఆఫర్లు ఉన్నాయని.. వాటిలో ఒకదాన్ని త్వరలో ఫైనల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/