Begin typing your search above and press return to search.
పక్క భాషల వైపు.. డాటర్ చూపు
By: Tupaki Desk | 14 July 2016 6:13 AM GMTమెగా డాటర్ కొణిదెల నీహారిక పట్టు పట్టి మరీ టాలీవుడ్ అరంగేట్రం పూర్తి చేసింది. ఒక మనసు మూవీతో హీరోయిన్ గా పరిచయం అయినా ఆ మూవీ రిజల్ట్.. నీహారికను డైలమాలో పడేసింది. యాక్టర్ గా గుర్తింపు వచ్చినా.. ఒక మనసు మాత్రం ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. దీంతో తర్వాతి సినిమాలపై డెసిషన్ తీసుకోలేకపోతోంది. ఇప్పటివరకూ తన రెండో సినిమాకు సైన్ చేయలేదు నీహారిక.
ప్రస్తుతం నీహారిక ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసేందుకు చూస్తున్నట్లు సమాచారం. తెలుగు హీరోయిన్ ఇతర భాషల వైపు చూసేందకు కారణం ఉంది. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో.. నీహారికను హీరోయిన్ గా తీసుకుంటే గ్లామర్ షో ఉండదనే విషయం మన హీరోలకు దర్శక నిర్మాతలకు బాగానే తెలుసు. మరోవైపు ఈమెను హీరోయిన్ చేస్తే.. తమ డామినేషన్ ఉండదనే భయం కుర్ర హీరోలను వెంటాడుతోంది. వీటన్నిటికీ తోడు.. మెగా ఫ్యామిలీ హీరోల్లో చాలామంది ఈమెకు సోదరులే.
అందుకే తమిళ్ - మలయాళ భాషల్లో చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవనే ఆలోచనలో ఉందట నీహారిక. 'నేను రెండు సినిమాలు మాత్రమే చేసినా వాటిలో క్వాలిటీ ఉంటుంది. నేను ఒక భాషకే పరిమితం అవ్వాలని అనుకోవడం లేదు' అని నీహారిక ఇచ్చిన స్టేట్ మెంట్ కి అర్ధం ఇదే.